అసోం వరదలు.. రూ.25 కోట్ల సాయం ప్రకటించిన రియలన్స్‌ ఫౌండేషన్‌

25 Jun, 2022 15:15 IST|Sakshi

వరదల కారణంగా అతలాకుతలమైన అసోంకు బాసటగా నిలిచేందుకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. వరద సాయం కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 కోట్ల సాయం అందిస్తున్నట్టు రియలన్స్‌ ఫౌండేన్‌ ప్రకటిచింది. రిలయన్స్‌ సాయం పట్ల అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ హర్షం వ్యక్తం చేశారు. 

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అసోంలో వరదలు ముంచెత్తాయి. వేలాది గ్రామాల్లో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. గత నెలరోజులుగా అసోంతో పాటు కేంద్ర ప్రభుత్వాలకు సహాకారం అందిస్తూ క్షేత్రస్థాయిలో తన వంతు సేవా కార్యక్రమాలను రిలయన్స్‌ ఫౌండేషన్‌ కొనసాగిస్తూ వస్తోంది. ముఖ్యంగా వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కచర్‌, సిల్చర్‌, కలైన్‌, బర్కోలా జిల్లాలో బాధితుగలకు అండగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ అనేక కార్యక్రమాలు చేపడుతోంది.

చదవండి: 'ట్రెండ్స్‌' ఫెస్టివల్‌ సేల్‌,దుస్తులపై భారీ డిస్కౌంట్‌!

మరిన్ని వార్తలు