క్రిప్టో కింగ్‌కి 40 నుంచి 50 ఏళ్ల జైలు శిక్ష?

16 Mar, 2024 10:03 IST|Sakshi

సాక్షి, వాషింగ్టన్ : ప్రపంచంలోనే అపరకుబేరుడు, క్రిప్టో కింగ్‌, ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్‌  40 నుంచి 50 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించనున్నారా? తప్పు చేశానని ఒప్పుకుంటూనే తానెవరిని మోసం చేయలేదన్న శామ్‌ బ్యాంక్‌మాన్‌ ఫ్రైడ్‌ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం తరుపున వాదించే ప్రాసిక్యూటర్లు న్యాయస్థానాన్ని ఎందుకు కోరుతున్నారు.   

క్రిప్టో మొగల్ శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్‌కు 40 నుంచి 50 ఏళ్ల మధ్య జైలు శిక్ష విధించాలనిప్రాసిక్యూటర్లు కోర్టును అభ్యర్థించారు. సుదీర్ఘంగా ఎందుకు జైలు శిక్ష విధించాలో చెబుతూ.. కస్టమర్లను 8 బిలియన్ల  భారీ మోసానికి పాల్పడ్డారంటూ అందుకు తగ్గ ఆధారాల్ని కోర్టుకు అందజేశారు.  

గత ఏడాది నవంబర్‌లో ఎఫ్‌టీఎక్స్‌లో జరిగిన మోసాలపై అమెరికా న్యాయ స్థానం ఫ్రైడ్‌ను దోషిగా పరిగణలోకి తీసుకుంది. కుట్ర, మనీ ల్యాండరింగ్‌, మోసంతో పాటు మొత్తం ఏడు రకాల కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఈ ఏడాది మార్చి 28 నుంచి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. 

ప్రైడ్‌కు అనారోగ్య సమస్యలు
అయితే, ఫ్రైడ్ న్యాయవాదులు 98 పేజీల మెమోలో ప్రైడ్‌ ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఐదు నుండి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించాలని కోరారు. మెమోలో తన క్లైయింట్‌ (ప్రైడ్‌) నాడీ సంబంధిత అనారోగ్య బాధపడుతున్నారని, వాటిని అధిగమించలేకపోతున్నారని పేర్కొన్నారు.  

 జైలు శిక్ష అనుభవిస్తారా?
దీనిపై ప్రభుత్వం తరుపు ప్రాసిక్యూటర్లు ప్రైడ్‌ కుటుంబం గురించి, వారి తల్లిదండ్రుల గురించి ఆరా తీశారు. నిందితుడి తల్లిదండ్రులిద్దరూ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సీ ప్రొఫెసర్లు. ఫ్రైడ్‌ సైతం ఎంఐటి గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు.కానీ అత్యాశ, మదుపర్లు పెట్టిన పెట్టుబడులతో జూదం ఆడినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? మార్చి 28 నుంచి ఫ్రైడ్‌ జైలు శిక్షను అనుభవిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers