సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ -చిన్న షేర్లు జూమ్‌

14 Sep, 2020 09:43 IST|Sakshi

353 పాయింట్లు అప్‌- 39,207కు సెన్సెక్స్‌

96 పాయింట్లు ప్లస్‌- 11,560 వద్ద నిఫ్టీ ట్రేడింగ్‌

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే

బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.5-3 శాతం అప్‌

దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించింది. నిఫ్టీ సైతం సెంచరీకి చేరువలో కదులుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 353 పాయింట్లు జంప్‌చేసి 39,207 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 96 పాయింట్లు పురోగమించి 11,560ను తాకింది. టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో శుక్రవారం యూఎస్‌ మార్కెట్లలో నాస్‌డాక్‌ డీలాపడగా.. బ్లూచిప్స్‌ దన్నుతో డోజోన్స్‌ బలపడింది. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. దీంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు.  

బ్లూచిప్స్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో మీడియా, రియల్టీసహా అన్ని రంగాలూ బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్‌ టెక్‌ 4.2 శాతం జంప్‌చేయగా.. టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఆర్‌ఐఎల్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జీ, యాక్సిస్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, ఇండస్‌ఇండ్‌ 2-1.2 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా మాత్రమే అదికూడా 0.5-0.3 శాతం మధ్య డీలాపడ్డాయి.

వోల్టాస్‌ ప్లస్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో వోల్టాస్‌, పీవీఆర్, బీఈఎల్‌, మైండ్‌ట్రీ, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ఏసీసీ, ఎక్సైడ్‌, జిందాల్‌ స్టీల్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, సన్‌ టీవీ, అశోక్‌ లేలాండ్‌, పేజ్‌ 4.4-2 శాతం పుంజుకున్నాయి. అయితే భెల్‌, కాల్గేట్‌ పామోలివ్‌, గోద్రెజ్‌ సీపీ, కేడిలా, వేదాంతా, లుపిన్‌ 1.2-0.5 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.3-3 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1424 లాభపడగా., 327 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు