సెమీకండక్టర్‌ ప్లాంటు.. వారి ప్రతిపాదనలు వేర్వేరుగా పరిశీలిస్తాం... 

26 Jul, 2023 07:52 IST|Sakshi

కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడి

న్యూఢిల్లీ: భారత్‌లో సెమీకండక్టర్‌ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి వేదాంత, ఫాక్స్‌కాన్‌ సంస్థలు వేర్వేరుగా ప్రతిపాదనలను సమర్పించేంత వరకు ప్రభుత్వం వేచి చూస్తుందని, తర్వాత తగు విధంగా వాటిని మదింపు చేస్తుందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

గతంలో ఇరు సంస్థలు జాయింట్‌ వెంచర్‌గా ప్రతిపాదనలు ఇచ్చాయని, ప్రస్తుతం అవి వేర్వేరుగా ప్రపోజల్స్‌ ఇచ్చే యోచనలో ఉన్నాయని పేర్కొన్నారు. సెమీకాన్‌ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా అధునాతన సెమీకండక్టర్‌ టెక్నాలజీల ఎగ్జిబిషన్‌ ప్రారంభంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. సెమీకండక్టర్‌ రంగంలో 70 ఏళ్లలో లేనంత పురోగతిని గత 15 నెలల్లో సాధించగలిగామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు