Chandrababu Case Updates: స్కిల్‌స్కామ్‌లో యెల్లో బ్యాచ్‌కు చెంపపెట్టు సమాధానం ఇది

23 Sep, 2023 13:44 IST|Sakshi

స్కిల్‌ స్కామ్‌లో టీడీపీ, దాని అనుకూల మీడియా వింత వాదన

బిజినెస్‌ ఇండస్ట్రీ నుంచి లాజిక్‌ వాస్తవాలు

లేని పారదర్శకతను ఇప్పుడు ఉందని చెబుతారా?

తప్పు చేయకపోతే భుజాలు ఎందుకు తడుముకుంటారు?

తప్పు చేయలేదు అని కోర్టు ముందు ఎందుకు చెప్పట్లేదు?

అసలు CITDని ఎప్పుడు తీసుకొచ్చారు?

CITD రాకముందే బాబు&కో ఏం చేశారు?

ప్రతిష్ట్మాతక కేంద్ర సంస్థ CITD (Central institute of Tool Design) కన్నా, ప్రైవేట్ సంస్థే ముద్దా? అంటూ  టీడీపీ, దాని అనుకూల మీడియా  గగ్గోలు పెడతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు మదింపులో సీఐడీటీ నివేదికను పరిగణలోకి తీసుకోరా? ఒక్కో క్లస్టర్‌కు రూ.559 కోట్లుగా సీఐటీడీ నివేదికను ఎందుకు పట్టించుకోలేదంటున్న వారి ప్రశ్నల నేపథ్యంలో వాస్తవాలేంటో ఒకసారి పరిశీలిద్దాం.!

స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అమల్లో CITDని తమ పథకానికి అనుగుణంగా చంద్రబాబు, వారి మనుషులు వాడుకున్నారు. వాస్తవంగా ప్రాజెక్టు ప్రారంభానికి ఇలాంటి సంస్థలతో వాల్యూషన్‌ చేయించడం అన్నది నిబంధనల ప్రకారం జరిగే ప్రక్రియ. కాని విచిత్రంగా జీవో విడుదల చేశాక, దానికి విరుద్ధంగా MOU చేసుకున్నాక, ప్రాజెక్టులో నిర్ణయించుకున్న ప్రకారం రూ.371 కోట్లలో 90శాతం డబ్బంతా విడుదల చేసిన తర్వాత CIDT ఇండిపెండెంట్‌గా మదింపు చేయని, ప్రిలిమినరీ రిపోర్టును వాల్యూయేషన్‌గా చూపించే ప్రయత్నాన్ని టీడీపీ, ఎల్లోమీడియా చేస్తోంది. ఈ వ్యవహారంలో వాస్తవాలేంటో సీఐటీడీయే దర్యాప్తు అధికారుల ముందు వెల్లడించింది. 

ప్రాజెక్టుపై మదింపు నివేదిక ఇవ్వాలంటూ APSSDC అధికారులు, డిజైన్‌ టెక్‌ ప్రతినిధులు 2015 డిసెంబర్‌ 18న సీఐడీటీని కోరారు. 2016 మార్చి 22న సీఐటీడీ వీరు అడిగిన మేరకు ఒక ప్రాథమిక రిపోర్టు ఇచ్చింది. వాస్తవంగా అప్పటికే 90శాతం డబ్బును చంద్రబాబునాయుడు తాను అనుకున్నట్టుగా డిజైన్‌ టెక్‌కు విడుదలచేశారు. 

సీఐటీడీని నివేదిక కోరడానికి రెండువారాల ముందే 
2015 డిసెంబర్‌ 5నే రూ.185 కోట్లు, 
2016 జనవరి 29న రూ.85 కోట్లు, 
2016మార్చి 11న రూ.67 కోట్లు విడుదల చేశారు. 
2016 మార్చి 22న సీఐటీడీ ప్రిలిమినరీ రిపోర్టు వచ్చేలోగానే 
రూ.337 కోట్లు అంటే 90శాతం సొమ్ము డిజైన్‌ టెక్‌ కంపెనీకి ఇచ్చేశారు.
ఇది జరిగిన మరో 9 రోజులకు అంటే 2016 మార్చి 31న మిగిలిన రూ.34 కోట్లు కూడా విడుదల చేశారు.  90శాతం డబ్బులు ఇచ్చేశాక నివేదిక తీసుకోవడం ఏంటి? ఇది నిబంధనలకు విరుద్ధం కాదా?

అలాగే APSSDC ప్రాజెక్ట్‌పై తాము ఇండిపెండెంట్‌గా మందింపు చేయలేదని CITD స్పష్టం చేసింది.  అప్పటి సీమెన్స్‌ ఇండియా ఎండీ సుమన్‌బోస్‌ నుంచి వచ్చిన వివరాల ప్రాతిపదికనే ప్రిలిమనరీ రిపోర్టు ఇచ్చామని స్పష్టం చేసింది.  వారిచ్చిన ఇ-మెయిల్స్‌ను ఆధారంగా చేసిన ఈ రిపోర్టు ఇచ్చామని CITD వెల్లడించింది. సాఫ్ట్‌వేర్‌ విలువను మదింపు చేసే సామర్థ్యం తమకు లేదని కూడా చెప్పింది.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ క్లస్టర్లను స్వయంగా పరిశీలించి అక్కడి సాఫ్ట్‌వేర్, మౌలిక వసతులను పరిశీలించి ప్రాజెక్ట్‌ వ్యయాన్ని అంచనా వేయాల్సి ఉంటుందని, కానీ తమను ఆ విధంగా మదింపు నివేదిక ఇవ్వాలని అసలు APSSDC కోరనే లేదని CITD విచారణలో వెల్లడించింది. 

2.13 లక్షలమంది శిక్షణ పొందారని, 80వేల మందికి ఉద్యోగాలు వచ్చాయంటున్న TDP, దాని అనుకూల మీడియా.. 
విద్యార్థులు, యువతలో నైపుణ్యాభివృద్ధికోసం ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేస్తూనే ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకూ, సీమెన్స్‌ కోసం విడుదలచేసిన రూ.371 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ.745.66 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరాల్లోకూడా అనేక రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. 

ఈ కార్యక్రమాలన్నీ కూడా తాము తెచ్చామంటున్న రూ.3300 కోట్ల ప్రాజెక్టు కిందే చేపట్టామన్న తప్పుడు ప్రచారాన్ని లోకేష్‌, టీడీపీ, దాని అనుకూల మీడియా చేస్తున్నారు. అసలు 90 శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ప్రాజెక్టు తమ వద్ద లేదని, ఏపీ స్కిల్‌డెవల్‌మెంట్‌ ప్రాజెక్టులో తాములేమని సీమెన్స్‌ స్వయంగా చేసిన ఇంటర్నెల్‌ ఆడిట్‌ నివేదికలోనూ, దర్యాప్తు అధికారులతోనూ చెప్పింది. 164 CRPC కింద కూడా స్పష్టం చేసింది. 

మరి సీమెన్స్‌ లేనప్పుడు ఆ ప్రాజెక్టు కింద ఇన్ని లక్షలమంది శిక్షణ పొందారని ఎలా చెప్తారు? అలాగే ఆ ప్రాజెక్టు లేని సమయంలో కూడా వివిధ సంవత్సరాల్లో నైపుణ్యాభివృద్ధికోసం బడ్జెట్‌ద్వారా ఖర్చు చేసి, ఆ కార్యక్రమాల ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులను, చంద్రబాబు ఫేక్‌ ప్రాజెక్టులో భాగంగా ఎలా చూపిస్తారు?

మరిన్ని వార్తలు