అలర్ట్‌.. రెండు రోజుల్లో ముగియనున్న గడువు

29 Mar, 2024 13:32 IST|Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆర్థికపరమైన పనులకు అదే చివరి తేదీగా ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి చాలా సంస్థల నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. మార్చి 31తో గడువు ముగియనున్న కొన్నింటి వివరాలు ఈ కింది కథనంలో తెలుసుకుందాం.

పెట్టుబడిదారులు దీర్ఘకాలిక లాభాలకోసం మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తూంటారు. అధికారిక ధ్రువీకరణలతో కేవైసీ నిబంధనలను పూర్తి చేయని వారు మార్చి 31లోపు రీకేవైసీని పూర్తి చేయాలి. బ్యాంకుల్లోనూ ఆధార్‌, పాన్‌ కార్డులాంటివి లేకపోతే గడువులోపు కేవైసీని అప్‌డేట్‌ చేయాలి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అందిస్తున్న అమృత్‌ కలశ్‌ ప్రత్యేక డిపాజిట్‌ వ్యవధి మార్చి 31తో ముగియనుంది. దీని వ్యవధి 400 రోజులు. వడ్డీ రేటు 7.10 శాతం. సీనియర్లకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది.

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో టార్గెట్‌ రీచ్‌ అవ్వడానికి కొన్ని బ్యాంకులు హోంలోన్లపై మార్చి 31 వరకు రాయితీలు ఇస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి, అప్‌డేటెడ్‌ రిటర్నులు దాఖలు చేయడానికి గడువు ముగుస్తుంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిన వారు ఈ పనిని పూర్తి చేయాలి. 2021-22, 2022-23, 2023-24 మదింపు సంవత్సరాలకు సంబంధించి వీటిని దాఖలు చేసేందుకు ఆదాయపు పన్ను విభాగం అనుమతినిచ్చింది.

ఇదీ చదవండి: అంబానీ-అదానీ దోస్త్‌ మేరా దోస్త్‌..!

Election 2024

మరిన్ని వార్తలు