సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

13 Dec, 2023 10:57 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు దేశీయంగా వెలువడనున్న ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో మదుపర్లు కొంత లాభాలు స్వీకరిస్తున్నారు. దీంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు ఒడుదొడుకులకు గురవుతున్నాయి. ట్రేడింగ్ ఆరంభంలో స్వల్ప లాభాలతో ఉన్న సూచీలు కాసేపటికే నష్టాల్లోకి వెళ్లిపోయాయి.

బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 100 పాయింట్ల నష్టంతో 69,450 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 20,881 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.38గా కొనసాగుతోంది. ఐషర్‌ మోటార్స్‌, ఎన్టీపీసీ, ఐటీసీ, భారత్‌ పెట్రోలియం, యూపీఎల్‌ లిమిటెడ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ఓఎన్జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ సూచీ 0.46శాతం, డోజోన్స్‌ 0.48శాతం, నాస్‌డాక్‌ 0.70శాతం మేర లాభపడ్డాయి. అటు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీ, జపాన్‌ నిక్కీ లాభాల్లో ఉండగా.. కొరియా, హాంకాంగ్‌ సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

>
మరిన్ని వార్తలు