సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు..రికవరీ ఎప్పుడంటే..

26 Oct, 2023 16:03 IST|Sakshi

ఈక్విటీ మార్కెట్లు గురువారం సైతం నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ గత పది ట్రేడింగ్ సెషన్‌ల్లో తొమ్మిదింటిలో నష్టాల్లోకి లాగబడ్డాయి. దాంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ఈవెంట్‌కు మార్కెట్ ఎల్లప్పుడూ ముందే స్పందిస్తుంది.  కాబట్టి, ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రాబోయే నెలల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మరింత కఠినంగా మారుతాయని భావిస్తున్నారు. దాంతో మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి.

చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. డాలర్‌ పెరుగుతుడడంతో రూపాయి పతనం కొనసాగవచ్చనే భయాలు ఉన్నాయి. అమెరికా బాండ్‌ ఈల్డ్‌లు గరిష్ఠస్థాయికి చేరుతున్నాయి. విదేశీ, రిటైల్‌ మదుపరులు ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలకు మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు ఇంకా దిగజారిపోతున్నాయి. మార్కెట్లు ఓవర్‌సోల్డ్‌ జోన్‌లోకి చేరుకోవడంతోపాటు, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి సద్దుమనుగుతే తప్పా మార్కెట్లు కోలుకునే అవకాశం లేదని తెలుస్తుంది.

దేశీయ మార్కెట్‌ సూచీలైన నిఫ్టీ గడిచిన ‍ట్రేడింగ్‌తో పోలిస్తే 264 పాయింట్లు నష్టపోయి 18857 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 900 పాయింట్లు నష్టపోయి 63148 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.210కు చేరింది. క్రూడ్‌ బ్యారెల్‌ ధర 84.36డాలర్లకు చేరింది. ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.32శాతం పడిపోయింది. ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.06శాతం నష్టాల్లోకి జారుకున్నాయి. సెనెక్స్‌ 30 లో యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ మినహా అన్ని స్టాక్‌లు నష్టాల్లోకి వెళ్లాయి. అధికంగా ఎం అండ్‌ ఎం, బజాజ్‌ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌లు నష్టపోయాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు