టాటా పవర్‌ లాభం అప్‌

7 May, 2022 10:33 IST|Sakshi

క్యూ4లో రూ. 632 కోట్లు  

న్యూఢిల్లీ: ప్రైయివేట్‌ రంగ దిగ్గజం టాటా పవర్‌ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 31 శాతం జంప్‌చేసి రూ. 632 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 481 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం వృద్ధితో రూ. 12,085 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 10,379 కోట్ల టర్నోవర్‌ ప్రకటించింది. వాటాదారులకు షేరుకి 1.75 డివిడెండ్‌ ప్రకటించింది. జులై 7న వార్షిక వాటాదారుల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి  నికర లాభం రూ. 1,439 కోట్లనుంచి రూ. 2,156 కోట్లకు ఎగసింది. ఇక మొత్తం ఆదాయం 28 శాతం మెరుగుపడి రూ. 42,576 కోట్లకు చేరింది. 

2020–21లో రూ. 33,239 కోట్ల టర్నోవర్‌ సాధించింది. కాగా.. క్యూ4లో ఎక్సెప్షనల్‌ ఐటమ్స్‌కు ముందు కన్సాలిడేటెడ్‌ నికర లాభం 76 శాతం జంప్‌చేసి రూ. 775 కోట్లకు చేరగా.. పూర్తి ఏడాదికి 61 శాతం అధికంగా రూ. 2,298 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది. 
 

చదవండి: రిలయన్స్‌ రికార్డులు..తొలి కంపెనీగా..

మరిన్ని వార్తలు