బ్రెజిల్‌లో ఫుట్‌బాల్‌ ఆడుతున్న మహాత్మాగాంధీ!

15 Nov, 2023 07:18 IST|Sakshi

రియో డీ జెనెరో : బ్రెజిల్‌లో కుర్రాళ్లు ఫుడ్‌బాల్‌ ఆడడంలో వింతేం లేదు. ఆ దేశంలో ఫుట్‌బాల్‌కు ఇండియాలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్‌ ఉన్న విషయం తెలిసిందే.అయితే ఓ యువ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.దీనికి కారణం అతని ఆట తీరో ఇంకొకటో కాదు.అతని పేరులోని గొప్పతనం. 

బ్రెజిల్‌లోని ట్రిండేడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌లో మిడ్‌ఫీల్డర్‌గా ఆడుతున్న 31 ఏళ్ల ఆ ఆటగాడి పేరు మహాత్మాగాంధీ హెబెర్పియో మట్టోస్‌ పిరెస్‌.దీంతో  అందరి దృష్టి అతడిపై పడుతోంది.2011 నుంచి మహాత్మా గాంధీ క్లబ్‌ తరపున ఫుట్‌బాల్‌ ఆడుతున్నాడు. 

మహాత్మాగాంధీ ఒక్క పేరే కాకుండా బ్రెజిల్లోని ఫుట్‌బాల్‌ క్లబ్బుల్లో చాలా మంది ఆటగాళ్లకు ప్రఖ్యాతి గాంచిన వ్యక్తుల పేర్లుండడం విశేషం.ఒక ఆటగాడికి బీటిల్స్ సింగర్‌ జాన్‌ లెన్నన్‌ పేరుండగా మరో ఆటగాడు బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌లలో ఒకటైన పికాచు అనే పేరు పెట్టుకున్నాడు.ఇవే కాకుండా మర్లన్‌ బ్రాండో,మస్కిటో లాంటివి ఇంకా చాలా అందరి దృష్టిని ఆకర్షించే పేర్లున్న ఆటగాళ్లున్నారు. 

ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ప్రకారం జాతిపిత మహాత్మాగాంధీ 1893 నుంచి 1915 వరకు దక్షిణాఫఫ్రికాలో ఉన్నపుడు అక్కడ మూడు ఫుట్‌బాల్‌ టీమ్‌లను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. జోహెన్నెస్‌ బర్గ్‌, ప్రిటోరియా, డర్బన్‌ ఫుట్‌బాల్‌​ క్లబ్లును గాంధీ స్వయంగా స్థాపించారు.దీంతో ఫుట్‌బాల్‌ క్రీడపై గాంధీ చెరగని ముద్ర వేసినట్లయింది. 
ఇదీ చదవండి.. ఫ్రీ మీల్స్‌ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే? 

మరిన్ని వార్తలు