బయోటెక్నాలజీలో సాంకేతికతకు కీలక పాత్ర

8 Dec, 2023 04:59 IST|Sakshi

బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌–షా

న్యూఢిల్లీ: భవిష్యత్తులో బయోటెక్నాలజీ రంగ వృద్ధిలోనూ, కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలోనూ సాంకేతికత చాలా కీలక పాత్ర పోషించగలదని బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌–షా తెలిపారు. నియంత్రణ ప్రక్రియలను సంస్కరించేందుకు, నూతన ఔషధాలను చాలా తక్కువ వ్యవధిలోనే మార్కెట్‌కు చేర్చేందుకు, వివిధ రంగాల్లో టెక్నాలజీని మరింత సమర్ధంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్‌ టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు.

ఒక ఐడియా అత్యంత తక్కువ సమయంలో, ఏడాది వ్యవధిలోనే ప్రయోగశాల నుంచి మార్కెట్‌కు చేరగలిగితే బాగుంటుందని, ఇందుకోసం మన నియంత్రణ ప్రక్రియలను సమూలంగా సంస్కరించాల్సిన అవసరం ఉందని మజుందార్‌–షా చెప్పారు. దీనికోసం జనరేటివ్‌ ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్, డేటా ఆనలిటిక్స్‌ మొదలైనవి ఉపయోగపడగలవని ఆమె పేర్కొన్నారు. సాధారణంగా ఉత్పత్తులను ఆమోదించడానికి సంబంధించి టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో నియంత్రణ సంస్థలు చాలా నెమ్మదిగా వ్యవహరిస్తుంటాయని మజుందార్‌–షా తెలిపారు. నియంత్రణ అధికారులకు టెక్నికల్‌ నైపుణ్యాలు ఉండి, టెక్నాలజీపై అవగాహన ఉంటేనే అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలన్న లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు