పారిశ్రామిక రంగం పరపతి మెరుగుపడుతుంది

8 Dec, 2023 04:46 IST|Sakshi

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా

న్యూఢిల్లీ: భారత పరిశ్రమల పరపతి డిసెంబర్‌ త్రైమాసికంలో మెరుగుపడుతుందని, రుణాలపై వడ్డీ చెల్లింపుల కవరేజీ 4.5–5 రెట్లు పెరుగుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. కార్పొరేట్‌ ఇండియా ఆదాయాలు మెరుగుపడడాన్ని ఇందుకు అనుకూలించే అంశంగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంత్సరం ద్వితీయ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్‌) 601 లిస్టెడ్‌ కంపెనీల (ఫైనాన్షియల్‌ సరీ్వసులు మినహా) బ్యాలన్స్‌ షీట్లను విశ్లేíÙంచిన అనంతరం ఇక్రా ఈ వివరాలు వెల్లడించింది.

కంపెనీల ఆపరేటింగ్‌ మార్జిన్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 3.98 శాతం, అంతకుముందు త్రైమాసికంతో పోల్చిచూస్తే 0.64 శాతం మెరుగుపడినట్టు తెలిపింది. కమోడిటీల ధరలు శాంతించడాన్ని సానుకూలంగా పేర్కొంది. ముడి పదార్థాల ధరలు ఇటీవలి కాలంలో తగ్గడాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ ఇవి చారిత్రకంగా చూస్తే, ఇంకా ఎగువ స్థాయిల్లోనే ఉన్నట్టు పేర్కొంది. భారత కంపెనీల నిర్వహణ మార్జిన్లు ఇంకా చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకోవాల్సి ఉందని వివరించింది.

>
మరిన్ని వార్తలు