నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సైబర్‌ట్రక్‌ లాంచ్ చేసిన టెస్లా - ధర ఎంతంటే?

3 Dec, 2023 17:27 IST|Sakshi

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టెస్లా 'సైబర్‌ట్రక్‌' (Cybertruck) డెలివరీలు ఎట్టకేలకు మొదలయ్యాయి. ఈ కొత్త సైబర్‌ట్రక్‌ వేరియంట్స్, ధరలు, రేంజ్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

టెస్లా సైబర్‌ట్రక్‌ ప్రారంభ ధర 60990 డాలర్లు (రూ. 50.83 లక్షలు), హై వేరియంట్ ధర 99,990 డాలర్లు (రూ. 83.21 లక్షలు). ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ ట్రక్ డెలివరీలు సౌత్ అమెరికాలో మాత్రమే జరిగినట్లు సమాచారం. రానున్న రోజుల్లో మరిన్ని డెలివరీలు జరిగే అవకాశం ఉంది.

కొత్త టెస్లా సైబర్‌ట్రక్‌ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. దీని కోసం ముందస్తుగా 100 డాలర్లు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది డ్యూయెల్, ట్రై మోటర్ అనే రెండు ఆప్షన్లలలో లభిస్తుంది. డ్యూయెల్ మోటార్ 600 బీహెచ్‌పీ పవర్, ట్రై మోటార్ 845 బీహెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇదీ చదవండి: చైనా వద్దు భారత్ ముద్దు.. ఇండియాపై పడ్డ అమెరికన్ కంపెనీ చూపు..

డ్యూయెల్ మోటార్ మోటార్ 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, ట్రై మోటార్ మోడల్ 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టెస్లా సైబర్‌ట్రక్‌ రేంజ్ 547 కిమీ వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ ట్ర‌క్‌ను 2025 నాటికి తక్కువ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు