సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన దేశీయ సూచీలు

19 Dec, 2023 09:28 IST|Sakshi

నిన్న నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేండింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 24.64 పాయింట్ల లాభంతో 71339.73 వద్ద, నిఫ్టీ 15.60 వద్ద 21434.30 వద్ద కొనసాగుతున్నాయి. ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా శుభారంభం పలికినట్లు తెలుస్తోంది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు క్షీణించి రూ. 83.13గా కొనసాగుతోంది. నిఫ్టీలో ఓఎన్జీసీ, నెస్లే, అపోలో హాస్పిటల్స్‌, బ్రిటానియా, కోల్‌ ఇండియా షేర్లు లాభాల్లో ఉండగా.. టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటన్‌ కంపెనీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.

అమెరికా మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. డోజోన్స్‌ 0.86శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.45శాతం, నాస్‌డాక్‌ సూచీ 0.61శాతం మేర లాభపడ్డాయి. అటు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.59శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా.. జపాన్‌ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఆటో, హిందాల్కో, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) వంటి కంపెనీలు చేరాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, జేఎస్ డబ్ల్యు స్టీల్, టీసీఎస్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

>
మరిన్ని వార్తలు