ఖాన్సార్‌ ఎరుపెక్కాల.!

19 Dec, 2023 01:02 IST|Sakshi

‘‘చిన్నప్పుడు నీకో కథ చెప్పేవాడిని.. పర్షియన్  సామ్రాజ్యంలో సుల్తాన్  ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు’’ అనే వాయిస్‌ ఓవర్‌తో ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ సినిమా రిలీజ్‌ ట్రైలర్‌ విడుదలైంది. ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్‌’. శ్రుతీహాసన్  హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్ , జగపతిబాబు, టీనూ ఆనంద్, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషించారు.

హోంబలే ఫిలింస్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ‘సలార్‌’ మూవీ మొదటి భాగం ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ రిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ట్రైలర్‌ చూస్తే.. ఈ చిత్రంలో మెకానిక్‌ పాత్రలో ప్రభాస్‌ నటించినట్లు తెలుస్తోంది.

‘ఖాన్సార్‌లో క్యాలిక్యులేటర్‌ పెట్టుకుని ఏం లెక్కపెట్టలేం’, ‘అందుకే లెక్కపెట్టలేని ఓ పిచ్చోడిని తీసుకువచ్చాను’ (పృథ్వీరాజ్‌ సుకుమారన్ ), ‘ఖాన్సార్‌ ఎరుపెక్కాల..’, ‘మండే నిప్పుతోనైనా.. వీళ్ల రక్తంతోనైనా’ (ప్రభాస్‌), ‘ఖాన్సార్‌ వల్ల చాలా కథలు మారాయి.. కానీ, ఖాన్సార్‌ కథ మార్చింది ఇద్దరుప్రాణస్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం’’ వంటి డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు