ఇబ్బంది పెట్టే కాల్స్, సందేశాలకు చెక్‌!

29 Nov, 2022 06:14 IST|Sakshi

పలు టెక్నాలజీపై పనిచేస్తున్న ట్రాయ్‌

న్యూఢిల్లీ: ఇబ్బంది పెట్టే కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను గుర్తించేందుకు పలు టెక్నాలజీపై పనిచేస్తున్నట్టు టెలికం రంగ నియంత్రణ సంస్థ ‘ట్రాయ్‌’ ప్రకటించింది. ఆర్థిక మోసాల నివా­ర­ణకు ఇతర నియంత్రణ సంస్థలతో కలసి సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపింది. ‘‘అనుచిత వాణిజ్య సంప్రదింపులు లేదా ఇబ్బంది పెట్టే సంప్రదింపులు అన్నవి ప్రజలను ఎక్కువగా అసౌకర్యానికి గురిచేస్తున్నాయి.

వారి గోప్యతకు భంగం కలిగిస్తున్నాయి. నమోదు కాని టెలీ మార్కెటర్ల (యూటీఎం)కు వ్యతిరేకంగా అధిక ఫిర్యాదులు వస్తున్నాయి. పలు అనుచిత సందేశాలు కూడా పెరిగాయి. వీటితో పాటు ఇబ్బంది పెట్టే కాల్స్‌ను కూడా ఒకే రీతిలో చూడడమే కాకుండా, పరిష్కారం కనుగొనాల్సి ఉంది’’అని ట్రాయ్‌ పేర్కొంది. అనుమతి లేని వాణిజ్య సంప్రదింపులకు చెక్‌ పెట్టేందుకు పలు భాగస్వామ్య సంస్థలో కలసి చర్యలు తీసుకోనున్నట్టు ట్రాయ్‌ తెలిపింది. 

మరిన్ని వార్తలు