బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి: ఎమ్మెల్యే రాజాసింగ్‌

26 Oct, 2023 08:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని బీజేఎల్పీనేత, గోషామహల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ తెలిపారు. ఈ ఫోన్లు 15 డిజిట్‌ నంబర్‌ నుంచి వస్తున్నాయని, తనను చంపుతామని, నరుకుతామని భయపెట్టిస్తున్నారని బుధవారం మీడియాతో వెల్లడించారు.

తనకు ఫోన్‌ చేసి తన గురించి, తాను ఎక్కడెక్కడికి వెళుతోంది ప్రతీ కదలిక గురించి తెలియజేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. గోషామహల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ వస్తుండటంతో, తమ ఇద్దరినీ కలిపి చంపుతామని హెచ్చరించినట్లు రాజాసింగ్‌ చెప్పారు.

బుధవారం మధ్యాహ్నం 1.59 గంటలకు +61 9664800063233 నుంచి తనకు ఫోన్‌ చేసి బెదిరించినట్లు తెలిపారు. దీనిపై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు రాజాసింగ్‌ వెల్లడించారు. ఈ బెదిరింపు ఫోన్‌ కాల్స్‌పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు
చదవండి: మజ్లిస్‌ పార్టీలో ‘చార్మినార్‌ అసెంబ్లీ సీటు’ చిచ్చు

మరిన్ని వార్తలు