వచ్చే మూడేళ్లలో పట్టాలెక్కనున్న 400 వందే భారత్‌ రైళ్లు

1 Feb, 2022 11:34 IST|Sakshi

ఎన్డీఏ సర్కారు ఈ సారి కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంపై దృష్టి సారించింది. మోదీ సర్కార్‌ కొలువుదీరిన తర్వాత కొత్త రైళ్లు స్టార్‌ చేయడం కంటే నూతన రైల్వేలైన్ల నిర్మాణం, డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌ పనులపై ఎక్కువగా ఫోకస్‌ చేశారు. గతానికి భిన్నంగా వందే భారత్‌ పేరుతో భారీగా రైళ్లు ప్రవేశపెట్టబోతున్నట్టు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇప్పటికే వరుసగా 75 వారాల పాటు  75 వందే భారత్‌ రైళ్లను నడిపిస్తామని పీఎం మోదీ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఆర్థిక మంత్రి ప్రకటన వచ్చింది.

కొత్తగా వచ్చే వందే భారత్‌ రైళ్లను పూర్తిగా లింకే హఫ్‌ మన్‌ బుష్‌ (ఎల్‌ఎఫ్‌బీ) కోచ్‌లతో రూపొందించబోతున్నారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ, కపుర్తాల, చెన్నైలలో ఉన్న కోచ్‌ ఫ్యాక్టరీలలో ఎల్‌ఎఫ్‌బీ కోచ్‌లను తయారు చేస్తున్నారు. ఏప్రిల్లో ఈ బోగీలకు సంబంధించిన టెస్ట్ జరుగనుందని మంత్రి అశ్వీనీ వైౌష్ణవ్ తెలిపారు. ఆగష్టు, సెప్టెంబరులో ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే ఈ రైళ్లు ప్రీమియం కేటగిరిలో సేవలు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు నగరాల నంచి దేశరాజధానికి వందే భారత్‌ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వచ్చే రైళ్లలో తెలంగాణ, ఏపీకి వాటా దక్కనుంది.

ఇక వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు రైల్వే నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తామని మంత్రి ప్రకటించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఎరువుల సరఫరాకే రైల్వే నెట్‌వర్క్‌ ఉపయోగపడుతోంది. కరోనా సంక్షోభం వచ్చాక రైళ్ల ద్వారా వ్యవసాయ ఉత్పత​​​‍్తుల రవాణా పెద్ద ఎత్తున చేపట్టారు. వీటి ఫలితాలు బాగుండటంతో ఈసారి చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే కార్గో సేవలు ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు పీఎం గతి శక్తి ద్వారా దేశవ్యాప్తంగా వంద కార్గో టెర్మినల్స్‌ నిర్మించబోతున్నారు. 

ఇతర కీలక అంశాలు

- రైల్వే, పోస్టల్‌ శాఖల సమన్వయంతో పార్సిస్‌ సర్వీసుల బలోపేతం

- ఆధునిక టెక్నాలజీ  సీల్ 4 సాయంతో రైలు ప్రమాదాలు నివారించేందుకు ‘కవచ్‌’ కార్యక్రమం. 2022-23 చివరి నాటికి కవచ్‌ పరిధిలో 2,000 కి.మీ ట్రాక్‌.

- రైల్వేలతో మాస్‌ అర్బన్‌ ట్రాన్సపోర్టేషన్‌ అనుసంధానం

- లోకల్‌ బిజినెస్‌ని ప్రోత్సహించేందుకు సప్లై చెయిన్‌ బలోపేతానికి వన్‌ స్టేషన్‌ - వన్‌ ప్రొడక్ట్‌ పథకం

 - ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1.37 లక్షల కోట్లు కేటాయింపు

- రైల్వే స్టేషన్ల డెవలప్మెంట్ కోసం రూ. 12,000 కోట్ల కేటాయింపు

మరిన్ని వార్తలు