Upcoming Smartphones: ఈ నెలలో విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్స్ - వివరాలు

1 Oct, 2023 21:18 IST|Sakshi

భారతదేశంలో ప్రస్తుతం పండుగ సీజన్ ప్రారంభమైపోయింది. దీంతో కొత్త వాహనాలు, కొత్త మొబైల్స్ కొనుగోలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కావున ఈ కథనంలో ఈ నెల (అక్టోబర్) దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్స్ గురించి తెలుసుకుందాం.

గూగుల్ పిక్సెల్ 8 సిరీస్
గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ అక్టోబర్ 04 న విడుదలకానున్నట్లు సమాచారం. ఇది పిక్సెల్ 8 & పిక్సెల్ 8 ప్రో అనే రెండు మోడల్స్‌లో విడుదలకానున్నట్లు సమాచారం. పిక్సెల్ 8లో 6.2 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే, ప్రో మోడల్ 6.7 ఇంచెస్ LTPO డిస్ప్లే పొందనున్నట్లు సమాచారం.

పిక్సెల్ 8 లో 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 'ప్రో' లో 50 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్ రియర్ ట్రిపుల్ కెమెరా ఉండవచ్చు. వీటి ధరలు వరుసగా రూ. 58170 & రూ. 74814 వరకు ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

వివో29 సిరీస్
వివో వి29 సిరీస్ కూడా ఈ నెల 4న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది కూడా వీ29, వీ29 ప్రో అనే రెండు వేరియంట్లలో విడుదలకానుంది. వీ29 లో 120 Hz రేటుతో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే ఉండవచ్చని సమాచారం. రెండు వేరియంట్లు మంచి కెమెరా సెటప్ కలిగి, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నాయి.

రెడ్‌మీ నోట్ 13 5జీ
చైనాలో విడుదలైన రెడ్‌మీ నోట్ 13 5జీ అక్టోబర్ చివరి నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది 6.6 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే పొందుతుంది. ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా చాలా అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ధరలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి..

వన్‌ప్లస్‌ ఓపెన్
అక్టోబర్ నెలలో విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్లలో వన్‌ప్లస్‌ ఓపెన్ ఒకటి. ఈ మొబైల్ ఈ నెల మధ్యలో లేదా చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో 7.8 ఇంచెస్ 2కే అమోల్డ్ స్క్రీన్, 6.3 ఇంచెస్ అమోల్డ్ కవర్ డిస్ప్లే ఉంటుంది. ధర & వివరాలు తెలియాల్సి ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ
ఈ నెల మొదటి వారంలో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.4 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉండనుంది. అంతే కాకుండా స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 లేదా ఎక్సీనోస్ 2200 చిప్ సెట్ ఉండనున్నట్లు సమాచారం. కెమరా సెటప్ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు