Boeing: సువర్ణావకాశం.. ఒక ఐడియా రూ.10 లక్షలు - ట్రై చేయండిలా!

14 Sep, 2023 14:03 IST|Sakshi

ఆధునిక కాలంలో సృజనాత్మకత పెరిగిపోతోంది. కేవలం చదువుకున్న వారు మాత్రమే కాకుండా నిరక్ష్యరాస్యులు కూడా తమదైన రీతిలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏవియేషన్ కంపెనీ బోయింగ్ ఇండియా కొత్త ఆలోచనల కోసం ఒక కార్యక్రమం ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, బోయింగ్ ఇండియా తన ప్రతిష్టాత్మక బోయింగ్ యూనివర్శిటీ ఇన్నోవేషన్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ (బిల్డ్) ప్రోగ్రామ్ కోసం విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు, ఇతర వర్ధమాన వ్యవస్థాపకులను ఆహ్వానించింది. ఇక్కడ వినూత్న ఆలోచలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో ఉత్తమ 7మందికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల బహుమతి లభిస్తుంది.

ఏరోస్పేస్, రక్షణ, టెక్నాలజీ, సామాజిక ప్రభావం వంటి విషయాలపైన ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా బిల్డ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆలోచనలను 2023 నవంబర్ 10 వరకు పంపవచ్చు.

గత ఏడాది ఇదే ప్రోగ్రామ్ కోసం టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలకు చెందిన విద్యార్థుల నుంచి 1600 కంటే ఎక్కువ,  స్టార్టప్ ఔత్సాహికుల నుంచి 800 కంటే ఎక్కువ ఆలోచనలు వెల్లువెత్తాయి. కాగా ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: 12 నెలలు ఆఫీసుకు రానక్కర్లేదు.. ఇంటి నుంచే పనిచేయండి..

ఈ సంవత్సరం బోయింగ్ బిల్డ్ ప్రోగ్రామ్ కోసం ఏడు ప్రసిద్ధ ఇంక్యుబేటర్‌లతో జతకట్టింది. అవి సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ - ఐఐటీ ముంబై, ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ - ఐఐటీ ఢిల్లీ, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ - ఐఐటీ గాంధీనగర్, ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్, సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్‌మెంట్ - ఐఐఎస్‌సీ బెంగళూరు, టీ-హబ్ హైదరాబాద్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ - కేఐఐటీ భువనేశ్వర్.

మరిన్ని వార్తలు