పక్కాగా ఓటర్ల జాబితా కసరత్తు

9 Nov, 2023 02:06 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్‌ఓ రాజశేఖర్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : ఓటర్ల జాబితా కసరత్తును ఈఆర్‌వోలు పక్కాగా చేస్తున్నారని డీఆర్‌వో రాజశేఖర్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఆర్‌వో మాట్లాడుతూ కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న ఈవీఎంల మొదటి లెవల్‌ చెకింగ్‌ పూర్తి కావొచ్చిందన్నారు. గురువారం మాక్‌ పోలింగ్‌ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులు పాల్గొనవచ్చని చెప్పారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు వచ్చిన దరఖాస్తులను, ఆయా ఓటర్ల ఇళ్లకు వెళ్లి పరిశీలించాలని బీఎల్‌వోలను ఆదేశించారు. ఇళ్లకు వెళ్లకుండా కసరత్తు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్ల జాబి తాలో ఒకే ప్రాంతంలో రెండు శాతానికి పైగా మార్పులు, చేర్పులకు దరఖాస్తులు నమోదైనట్లయితే ఈఆర్‌వోలు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలన్నారు. పలు పార్టీలకు చెందిన ప్రతినిధులు గంగరాజు, సురేంద్రకుమార్‌, రాజసింహులు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

నేటి మాక్‌ పోలింగ్‌లో

పార్టీల ప్రతినిధులు పాల్గొనాలి

డీఆర్‌ఓ రాజశేఖర్‌ వెల్లడి

మరిన్ని వార్తలు