ఎర్రగుంట పల్లె సమీపంలో చిరుత కలకలం

9 Nov, 2023 02:06 IST|Sakshi
గాయపడిన శైలజ
● రెండో సారి మహిళపై దాడి ● భయం గుప్పిట్లో సమీప ప్రజలు

వెదురుకుప్పం: మండలంలోని ఎర్రగుంట పల్లె సమీపంలోని లక్ష్మీ శ్రీనివాస స్టోన్‌క్రషర్‌ వద్ద చిరు త సంచరించిందంటూ ప్రచారం సాగడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అక్కడ పనిచేస్తున్న మహిళపై రెండో సారి దాడి చేయడంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే ... క్వారీ వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన శైలజ అనే మహిళ వంట పనిచేస్తోంది. 20 రోజుల కిందట బహిర్భూమి వెళ్లిన క్రమంలో హఠాత్తుగా ఆమైపె అడవి జంతువు దాడి చేసి గాయపరచింది. చిరుత పులి దాడి చేసినట్లు బాధితురాలు చెప్పడంతో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి గాలించారు. ఆధారాలను సేకరించారు. చిరుత సంచరించినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోయినప్పటికీ సమీప గ్రామాల ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని జాగ్రత్తలు, సూచ నలు ఇచ్చారు. అయితే తాజాగా మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో బహిర్భూమి కోసం బయటికి వచ్చిన అదే మహిళ శైలజపై అడవి జంతువు దాడి చేసి గాయపరచింది. ఆమె బుధవారం ఉదయం గాయాలతో పచ్చికాపల్లంలోని ఓ ప్రైవేటు వైద్య శాలకు వచ్చి చికిత్స చేసుకుంది. చిరుత పులి మళ్లీ దాడి చేసిందని, తాను చూశానని ఆమె చెబుతోంది. ఈ సంఘటనతో భయాందోళన నెలకొంటోంది. అటవీశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు