శ్రీ‌లంక ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత

17 May, 2021 15:22 IST|Sakshi

కొలంబో: శ్రీ‌లంక క్రికెట్‌ బోర్డులో ఆట‌గాళ్ల జీతాలు తగ్గించడంపై వివాదం తలెత్తింది. ఆట‌గాళ్ల జీతాల్లో 35 శాతం కోత విధిస్తూ శ్రీ‌లంక క్రికెట్ బోర్డ్ నిర్ణ‌యం తీసుకొన్న‌ది. దీంతో కెప్టెన్ క‌రుణ‌ర‌త్నే, మాథ్యూస్,సురంగ లక్మల్,దినేష్ చండిమల్  సహా పలువురు సీనియర్ క్రికెటర్లు ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించారు. కొత్త కేంద్ర ఒప్పందం ప్రకారం వికెట్ కీపర్లు నిరోషన్ దిక్వేలా, ధనంజయ్ డి సిల్వా మాత్ర‌మే ల‌బ్ధి పొంద‌నున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల నెలసరి జీతం దాదాపు రూ.73 లక్షలు. బోర్డు వీరిని టాప్ క్యాట‌గిరిలో వేసింది. దీంతో మ‌రో వారం రోజుల్లో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ వ‌న్డే సిరీస్‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. మే 23 నుంచి బంగ్లాదేశ్లో ఈ జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడవలసి ఉన్న‌ది.

కెప్టెన్‌కు కూడా త‌గ్గ‌నున్న జీతం
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కరుణరత్నేకు కూడా ఆయ‌న జీతంలో రూ.22 లక్షలు కోత విధించారు. ఈ ఏడాది జనవరిలో వాండరర్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన క‌రున‌ర‌త్నే.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌ల‌లో 427 పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ బోర్డు నుంచి ఏమాత్రం ఉప‌శ‌మ‌నం ల‌భించలేదు. కొత్త కాంట్రాక్టులో కరుణరత్నే జీతం రూ.73 లక్షల నుంచి రూ.51 లక్షలకు త‌గ్గించారు.

(చదవండి:10-12 ఏళ్లు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సచిన్‌)

మరిన్ని వార్తలు