ICC World Cup 2023: అంతిమ సమరం కోసం...

17 Nov, 2023 04:42 IST|Sakshi

అహ్మదాబాద్‌: వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో పోటీపడేందుకు భారత క్రికెట్‌ జట్టు గురువారం అహ్మదాబాద్‌ నగరానికి చేరుకుంది. విమానాశ్రయంలో భారత జట్టుకు ఘనస్వాగతం లభించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా జట్టుతో భారత్‌ తలపడుతుంది. ఫైనల్‌ వేదికపై ఎయిర్‌ షో ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఎయిర్‌ షో నిర్వహించేందుకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) సిద్ధమైంది.

ప్రధాని నరేంద్ర మోదీ సహా అతిరథ మహారథులు, లక్ష మంది ప్రేక్షకులు విచ్చేసే మ్యాచ్‌ వేదికపై ఐఏఎఫ్‌కు చెందిన ‘ది సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ టీమ్‌’ ఎయిర్‌ షోతో మ్యాచ్‌కు ముందే కనువిందు చేయనుంది. దీనికి సంబంధించిన రిహార్సల్స్‌ను నేడు, రేపు స్టేడియంపై చేస్తారని గుజరాత్‌కు చెందిన డిఫెన్స్‌ ప్రొ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వైమానిక విన్యాసాలతో అలరించడం సూర్యకిరణ్‌ టీమ్‌కు కొత్తేం కాదు. దేశవ్యాప్తంగా ఎయిర్‌ షోలు ఈ జట్టే చేస్తుంది. మొత్తం తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌లు నింగిలో తమ వైమానిక విన్యాసంతో ప్రేక్షకుల్ని ఆకట్టిపడేస్తాయి. మ్యాచ్‌ ప్రారంభానికి ముందుగా పది నిమిషాల పాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. 

మరిన్ని వార్తలు