సృష్టి ఆస్పత్రి ఎండీ నమ్రతకు రిమాండ్‌

28 Jul, 2020 06:48 IST|Sakshi
నిందితురాలు డాక్టర్‌ నమ్రతకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్‌ భాను  

అల్లిపురం (విశాఖ దక్షిణం):  యూనివర్షల్‌ సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ నమ్రతను మహారాణిపేట పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  పసిపిల్లల విక్రయం కేసులో మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసింది. ఈ కేసులో ఆదివారం ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌.కె.మీనా తెలిపారు. ఈ కేసులో కీలక నిందితురాలు, ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ నమ్రత పరారీలో ఉన్నందున ప్రత్యేక బృందాలు కర్ణాటక వెళ్లి అక్కడ ఆమెను సోమవారం   అరెస్ట్‌ చేసి,   ట్రాన్సిట్‌ వారెంట్‌ ద్వారా   విశాఖపట్నం తీసుకువచ్చారు.   వైద్య పరీక్షల నిమిత్తం రాత్రి 10 గంటల సమయంలో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్‌ భాను ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి  ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. దీంతో ఆమెను మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచగా 14 రోజులు రిమాండ్‌ విధించారు.  

మరిన్ని వార్తలు