ఒక్క ఫోన్‌ నెంబర్‌తో లూటీ... రెచ్చిపోయిన సైబర్‌ నేరగాళ్లు

10 Mar, 2022 10:34 IST|Sakshi

హిమాయత్‌నగర్‌: అమెజాన్‌ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరుపై, మీ ఫోన్‌ నంబర్‌పై రూ. కోటి లాటరీ వచ్చిందని నగర మహిళకు ఎర వేశారు సైబర్‌ నేరగాళ్లు. రూ.కోటి మీ సొంతం కావాలంటే ప్రాసెసింగ్‌ చార్జీల నిమిత్తం కొంత డబ్బు చెల్లించాలన్నారు. దీనికి ఆశపడిన బాధితురాలు వారు కోరిన విధంగా పలు దఫాలుగా 15 రోజుల్లో రూ. 15 లక్షలు వారు చెప్పిన ఖాతాల్లో జమ చేసింది. రోజులు గడుస్తున్నా డబ్బులు మాత్రం చేతికి అందకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కంపెనీ నుంచి రూ. 11 లక్షలు... 
గోల్కొండ కేంద్రంగా పని చేస్తున్న ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నుంచి రూ. 11 లక్షలు మాయమైనట్లు కంపెనీ ప్రతినిధులు మంగళవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యా దు చేశారు. కంపెనీకి సంబంధించిన బ్యాంక్‌ ఖాతాల ఫోన్‌ నంబర్లను ఇటీవల మార్చారు. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే కంపెనీ ఖాతా నుంచి రూ. 11 లక్షలు డెబిట్‌ అయినట్లు గుర్తించారు.   కేసు నమోదు చేసిన పోలీసులు సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడగా రూ. 4 లక్షలను ఫ్రీజ్‌ చేయగలిగారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.   

(చదవండి: పోలీసులకు విదేశీ వనిత కృతజ్ఞతలు)

మరిన్ని వార్తలు