విషాదం: లోపలున్న 9 మందీ మృతి

21 Aug, 2020 16:40 IST|Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌‌: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్‌ ఉత్పత్తి​ కేంద్రం అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిదిమందీ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు తెలంగాణ జెన్‌ కో అధికారులు ప్రకటించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం...‘రాత్రి 10.30 గంటలకు ప్యానెల్స్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం గుర్తించిన ఉద్యోగులు మంటలార్పేందుకు యత్నించారు. ప్రాణాలు లెక్క చేయకుండా ప్లాంట్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. రాత్రి 12 గంటల సమయంలో ఫోన్‌ చేసి ప్రమాదంపై సమాచారం అందించారు. ఆపదలో చిక్కుకున్నట్లు కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి చెప్పారు. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు ప్లాంట్‌లో ఉన్నారు. 9 మంది దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. మరో 8 మంది సురక్షితంగా బయటపడ్డారు’అని పేర్కొన్నారు.
(పవర్‌ హౌజ్‌ ప్రమాదం: సీఐడీ విచారణకు కేసీఆర్‌ ఆదేశం)

మృతుల వివరాలు
1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్
2.AE వెంకట్‌రావు, పాల్వంచ
3.AE మోహన్ కుమార్, హైదరాబాద్
4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్
5.AE సుందర్, సూర్యాపేట
6. జూనియర్‌ ప్లాంట్‌ ఆపరేటర్‌ రాంబాబు, ఖమ్మం జిల్లా
7. జూనియర్‌ ప్లాంట్‌ ఆపరేటర్‌ కిరణ్, పాల్వంచ
8. టెక్నీషియన్‌ మహేష్ కుమార్
9.హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి వినేష్ కుమార్

మరిన్ని వార్తలు