పచ్చ గూండాలు పేట్రేగిన వేళ..

16 Aug, 2023 05:08 IST|Sakshi
పుంగనూరు బైపాస్‌ వద్ద పోలీసుల వాహనాలను ధ్వంసం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు

పుంగనూరు నిందితులంతా పాత నేరస్తులు

దాడుల కోసం పార్టీలో గూండాలను ఎంపిక చేసి మరీ తెచ్చిన టీడీపీ

ఇప్పటివరకు 277 మందిపై కేసులు.. 90 మంది అరెస్టు

పరారీలో సూత్రధారులు, ప్రధాన పాత్రదారులు

సాక్షి, చిత్తూరు, పుంగనూరు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల తెలు­గు­దేశం పార్టీ సృష్టించిన విధ్వంసంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. పక్కా ప్రణాళిక, భారీ వ్యూహంతోనే ఈ దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథ­కాల­తో  ప్రజలకు చేరువైన  వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా అణగదొక్కట­మే లక్ష్యంగా టీడీపీ ఈ దాడులకు వ్యూహ రచన చేసింది

పక్కా ప్రణాళికతో జిల్లా నలుమూలల నుంచి టీడీపీకి చెందిన గూండాలను ఎంపిక చేసి మరీ పుంగనూరుకు తెచ్చినట్లు వెల్లడైంది. వా­రిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి. వీరిని ముందుగానే మార­ణాయుధాలతో సహా పుంగనూరులో మోహరించారు. చంద్రబాబు పర్యటనను కూడా వ్యూహా­త్మకంగా పుంగనూరుకు వచ్చేలా మార్పు చేశారు. ముందస్తు షెడ్యూల్‌లో లేకపోయినా, పోలీసుల అనుమతి లేకుండానే దాడుల కోసమే ఆయన పుంగనూరు వచ్చారు.

చంద్రబాబు వస్తూనే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడం, వెనువెంటనే విధ్వంసం సృష్టించడం.. అంతా వ్యూహం ప్రకారం చేశారు. కర్రలు, రాళ్లు, మద్యం సీసాలు, ఇతర మారణాయుధాలతో వందల సంఖ్యలో పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్‌ ఓ కంటి చూపు కోల్పోయాడు. అయితే, పోలీసులు చాలా సహనంతో వ్యవహరించడంతో టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. 

పుంగనూరు విధ్వంసంలో ఇప్పటి వరకు ఏడు నేరాలకు సంబంధించి మొత్తం 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. వారిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం వరకు  90 మందిని అరెస్ట్‌ చేశారు.వారికి కోర్టు రిమాండ్‌ విధించడంతో కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు చల్లా బాబుతోపాటు  కుట్ర, వ్యూహ రచన, దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న పలువురిని పోలీసులు గుర్తించారు. వారి గత చరిత్రను కూడా నిశితంగా పరిశీలించారు. దాడుల్లో భాగస్వాములైన వారిలో ఎక్కువ మంది పాత నేరాల చరిత్ర చూసి పోలీసులే షాక్‌ అయ్యారు. వారిలో కొందరి నేర చరిత్ర ఇదీ.. 

1. నేరాల్లో ఘనుడు చల్లా బాబు
పుంగనూరులో దాడి కేసులో ప్రధాన సూత్ర­దా­రి, పాత్రదారి ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబు అలియాస్‌ చల్లా రామచంద్రారెడ్డి అని పోలీసులు తేల్చారు. దాడులకు కుట్ర పన్నడం, వ్యూహాన్ని అమలుపరచడంలో ఇతనిదే ప్రధాన పాత్రగా పోలీసులు నిర్ధారించారు. చల్లా బాబు గత చరిత్ర అంతా నేర పూరితమేనని పోలీసు విచారణలో తేలింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్‌ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఇతను ఆలయ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. చల్లా బాబుపై ఉన్న పాత కేసుల్లో మచ్చుకు కొన్ని.. 
1.1985లో రొంపిచెర్ల పోలింగ్‌ స్టేషన్‌పై బాంబు దాడి కేసు
2. రొంపిచెర్ల క్రైం నం.368, 2021లో ఐపీసీ సెక్షన్లు, 143, 188, 341,269, 270, 290 రెడ్‌విత్‌ 149 ఐపీసీ, సెక్షన్‌ 3 ఈడీయాక్ట్‌
3. క్రైం నం.18–2021 ఐపీసీ సెక్షన్లు 353, 506 రెడ్‌విత్‌ 34 కింద కేసు
4. క్రైం నం.8–2022 ఐపీసీ సెక్షన్లు 188, 341 కింద చౌడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు
5. క్రైం నం.89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్‌ 149 కింద సోమల పీఎస్‌లో కేసు
6. క్రైం నం.72–2022 ఐపీసీ సెక్షన్లు› 341, 143, 290 రెడ్‌విత్‌ 149 కింద కేసు
7. క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్‌ 149 కింద కల్లూరు పోలీసు స్టేషన్‌లో కేసు

2. టీఎం బాబు (40)
ఊరు: తొట్లిగానిపల్లి, గుడిపల్లి, కుప్పం నియోజకవర్గం
పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు
పాత కేసులివీ..
1.  క్రైం నం.30–2009లో గుడిపల్లి పీఎస్‌లో పరిధిలో జరిగిన కేసు
2. క్రైం నం.171 ఇ, 506, 8–బి–1, ఏపీపీయాక్ట్‌ 
3. క్రైం నం.165–2010 ఐపీసీ 392 సెక్షన్ల కింద కుప్పం పోలీస్‌ స్టేషన్‌లో కేసు 
3. క్రైం నం.38–2022 ఐపీసీ సెక్షన్‌ 448, 427, 323, 324, రెడ్‌విత్‌ 34 కింద గుడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కేసు

3. భాష్యం విశ్వనాథనాయుడు (45)
మండలం: శాంతిపురం, కుప్పం నియోజకవర్గం
పార్టీ హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు
పాత కేసులు: 3 కేసుల్లో నిందితుడు
1. క్రైం నం.191–2021, ఐపీసీ సెక్షన్లు 143, 341, 506, 188, 59 డీఎంఏ, ఈడీఏ కింద రాళ్ళబుదుగూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు
2. క్రైం నం.73–2022, ఐపీసీ సెక్షన్లు 177 ,182, 155  సెక్షన్ల కింద రెండో కేసు
3. రామకుప్పం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో  క్రైం నం.130–2022 ,   ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 307, 324తో పాటు రెడ్‌విత్‌ 149 కింద కేసు

4. జి.దేవేంద్ర (31)
ఊరు: గోపన్నగారిపల్లి,  పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం
పార్టీలో హోదా: తెలుగు యువత మండల అధ్యక్షుడు
పాత కేసులు: కల్లూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో  క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్‌ 149 కింద కేసు నమోదైంది.

5. లెక్కల ధనుంజయనాయుడు 
ఊరు: కొక్కువారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం
పార్టీలో హోదా:  టీడీపీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ 
పాత కేసులు: రెండుకేసుల్లో  నిందితుడు
1. క్రైం. నం. 26–2022 నంబరుతో కల్లూరు పోలీస్‌ స్టేషన్‌  పరిధిలో ఐపీసీ సెక్షన్‌ 341, 506, 353, 143, 147, 148, రెడ్‌విత్‌ 149 కింద కేసు నమోదు
2. క్రైం.నం. 368– 2021. రొంపిచెర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్‌ 149 ఐపీసీ, సెక్షన్‌ 3  ఈడీ యాక్ట్‌ కింద కేసులు

6. ముల్లంగి వెంకటరమణ (52)
ఊరు: ముల్లంగివారిపల్లి, పులిచెర్ల మండలం
పార్టీలో హోదా: టీడీపీ ఎస్సీ సెల్‌ స్టేట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ
పాత కేసులు:  మూడు కేసుల్లో  నిందితుడు
1.క్రైం. నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148, రెడ్‌విత్‌ 149 ఐపీసీ కింద కల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు
2. ఇదే స్టేషన్‌ పరిధిలో క్రైం.నం. 35–2017 ఐపీసీ సెక్షన్లు 447, 427, 324తోపాటు 34 ఐపీసీ కింద కేసు నమోదు
3. ఇక్కడే క్రైం. నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌ విత్‌ 34 కింద మరో కేసు

7. నూకల నాగార్జున నాయుడు (33)
ఊరు: బొడిపటివారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం
పార్టీలో హోదా: టీడీపీ మండల యువనేత, రాష్ట్ర ఐటీ విభాగం సభ్యుడు
పాత కేసులు: ఆరు కేసుల్లో నిందితుడు. రొంపిచెర్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు, కల్లూరులో 1 , సోమల పరిధిలో మరొక కేసు
1. క్రైం.నం. 368–2021 ఐపీసీ 134, 188, 341, 269, 270, 290 రెడ్‌ విత్‌ 149 ఐపీసీతో పాటు సెక్షన్‌ 3 కింద ఈడీయాక్ట్‌ నమోదు
2. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌ విత్, 149
3. క్రైం.నం. 374–2021 ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 120బీ, 506, 507
4. క్రైం.నం. 5–2022 ఐపీసీ సెక్షన్లు 153, 427, 290 రెడ్‌ విత్‌ 34 ఐపీసీ
5. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌ విత్‌ 149 ఐపీసీ
6. క్రైం.నం. 149–2022 ఐపీసీ సెక్షన్లు 143, 148, 354డీ, 324, 506, 509 రెడ్‌విత్‌ 149

8. ఇ. క్రిష్ణమూర్తినాయుడు (55)
ఊరు: రాయవారిపల్లి గ్రామం,  రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం
పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు
పాత కేసులు: ఇతనిపై కల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి
1 క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 506, 353, 143, 147, 148 రెడ్‌విత్‌ 149
2. క్రైం.నం. 12–2021, ఐపీసీ సెక్షన్లు 353, 506, రెడ్‌ విత్‌ 34 ఐపీసీ

9. నాగిశెట్టి నాగరాజ (38)
ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం
హోదా: మండలం తెలుగు యువత అధ్యక్షుడు
పాత కేసులు: ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి. కల్లూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 3, రొంపిచెర్లలో మరో రెండు కేసులు
1. క్రైం.నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్‌ 34
2. క్రైం.నం. 368–2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్‌ 149తో పాటు సెక్షన్‌ 3 ఈడీ యాక్ట్‌
3. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌ విత్‌ 149 ఐపీసీ. 
4. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్‌ 149 ఐపీసీ. 
5. క్రైం.నం. 350–2021 ఐపీసీ సెక్షన్లు 151 సీఆర్‌పీసీ

10. కె.సహదేవుడు (50)
ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం
పార్టీలో హోదా: రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారి పల్లి ఎంపీటీసీ
పాత కేసులు: రొంపిచెర్ల, మరికొన్ని స్టేషన్లలో 8 కేసుల్లో నిందితుడు
1. క్రైం.నం. 89–2014 ఐపీసీ సెక్షన్లు 447, 506 రెడ్‌విత్‌ 34
2. క్రైం.నం. 331–2020 సీఆర్‌పీసీ 151
3. క్రైం.నం. 365–2020 సీఆర్‌పీసీ 151
4. క్రైం.నం. 14–2021 ఐపీసీ సెక్షన్లు 188 , 353, 506, రెడ్‌ విత్‌ 34
5. క్రైం.నం. 356–2021 ఐపీసీ సెక్షన్‌ 151
6. క్రైం.నం. 368–2021 ఐపీసీ 143, 188, 341, 269, 270, 290  రెడ్‌విత్‌ 149
7. క్రైం.నం. 9–2022 ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 143 రెడ్‌విత్‌ 149
8. క్రైం.నం. 10–2022 ఐపీసీ సెక్షన్లు 341, 323, 506, 153

11. ఉయ్యాల రమణ (44)
ఊరు: బొమ్మయ్యగారిపల్లి, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం
హోదా: రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు 
పాత కేసులు:  కల్లూరు , రొంపిచెర్ల, సోమల పోలీస్‌స్టేషన్ల పరిధిలో 8 కేసుల్లో నిందితుడు
1. క్రైం.నం. 140–2021 ఐపీసీ సెక్షన్‌ 353, 341 రెడ్‌ విత్‌ 34
2. క్రైం.నం. 368 – 2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269,270, 290 రెడ్‌విత్‌ 149 ఐపీసీతోపాటు 3 ఈడీ యాక్ట్‌
3. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్‌ 149
4. క్రైం.నం.15–2021 ఐపీసీ సెక్షన్లు 188, 506 రెడ్‌విత్‌ 34 ఐపీసీ
5. క్రైం.నం.40 – 2014 ఐపీసీ సెక్షన్లు 307, 326, 324 రెడ్‌విత్‌ 34
6. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్‌ 149
7. క్రైం.నం.140–2021 ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్‌ 34
8. క్రైం.నం. 89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్‌ 149

ఏ ఒక్కర్నీ వదలం
పుంగనూరు దుశ్చర్యలో పోలీసుల రక్తం కళ్ల చూసిన ప్రతి ఒక్కరినీ వదలం. చట్ట ప్రకారం ముందుకెళ్తాం. బందోబస్తు డ్యూటీ కోసం వచ్చిన పోలీసులను మట్టుపెట్టాలని చూడటం, రాళ్లు, మద్యం బాటిళ్లు విసరడంపై మా వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీల ఆధారంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేశాం. ప్రధాన నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆరోజు పోలీసులు అడ్డుపడకపోతే పుంగనూరు టౌన్‌లోకి పోయి విధ్వంసం సృష్టించేవాళ్లు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తప్పవు.– వై.రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు 

మరిన్ని వార్తలు