పెళ్లి జరిగి రెండు నెలలు కూడా కాలేదు.. ఇంతలో సడన్‌గా..

31 May, 2022 16:04 IST|Sakshi
అర్చన (ఫైల్‌)

సాక్షి,కొమరాడ(విజయనగరం): మండలంలోని కొత్త కంబవలస గ్రామానికి చెందిన కెంగువ అర్చన (22) ఆదివారం రాత్రి మృతి చెందింది. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్‌లో ఈ సంఘటన జరిగింది. సంఘటనకు సంబంధించి మృతురాలి తండ్రి నారాయణరావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గరుగుబిల్లి మండలం మరుపెంట పంచాయితీ సాంబన్నవలస గ్రామానికి చెందిన చందనపల్లి శ్రీధర్‌తో ఈ ఏడాది ఏప్రిల్‌ 6న సాంబన్నవలసకు చెందిన అర్చనకు వివాహం జరిగింది.

పెళ్ళి తర్వాత నవ దంపతులు వారు నివాసం ఉంటున్న మేడ్చల్‌కు ఉద్యోగరిత్యా వెళ్లారు. ఇంతలో ఏమి జరిగిందో తెలియదు కాని ఆదివారం రాత్రి అర్చన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వచ్చింది. అయితే అల్లుడే తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తండ్రి నారాయణరావు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

చదవండి: Tirupati Crime: భర్తే ఆమె పాలిట సైకో కిల్లర్‌.. భార్యను చంపి డెడ్‌బాడీని సూట్‌కేసులో..

మరిన్ని వార్తలు