యువతి ఆత్మహత్య..మంత్రాల నేపంతో దారుణం

25 Jun, 2021 21:12 IST|Sakshi

సాక్షి, ములుగు: సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా... కొంతమంది మనుషులు మాత్రం ఇంకా మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. మనిషి ఇంకా తన పాత పద్దతులను వీడటం లేదు , మంత్రాల నేపంతో మనుషులను చంపుతూనే ఉన్నాడు. చెప్పుడు మాటలు విని.. అమాయకులను బలి తీసుకుంటున్న ఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. 
మంత్రాలు నేపంతో  ఓ యువకున్ని గొడ్డలితో నరికి చంపిన ఘటన  ములుగు జిల్లా తాడ్వాయి మండలం బొల్లెపల్లి  గ్రామంలో  చోటుచేసుకుంది. వివరాలు లోకి వెళ్తే తోలెం విజయ్ కుమార్ అనే యువకుడు గత ఐదు సంవత్సరాలుగా కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఇదే గ్రామానికి చెందిన పూనేం సురేష్  (22) యొక్క చెల్లె నీలవేణి 6 నెలల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.విజయ్ కుమార్ మంత్రాలు చేయడం వల్లే తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందనే అనుమానంతో కక్ష పెంచుకున్నాడు. గురువారం రాత్రి సురేష్‌ మృతుడి ఇంటికి గొడ్డలి పట్టుకుని వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఆ తరువాత అతన్ని ఇంటి బయటకు లాక్కొచ్చి అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపివేశాడు. మృతుడికి తల్లిదండ్రలు ఎవరూ లేరు. పెద్దమ్మ పూనెం సారక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడ్వాయి ఎస్సై శ్రీ సీఎచ్.వెంకటేశ్వరరావు  కేసు నమోదు చేసుకొని సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు.
చదవండి:బ్యాంకు సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు

మరిన్ని వార్తలు