ప్రపంచంలో శక్తివంతమైన మైక్రోచిప్ అభివృద్ధి చేసిన టెస్లా

25 Jun, 2021 21:09 IST|Sakshi

ప్రపంచ ఎలక్ట్రానిక్, ఆటోమోటివ్ పరిశ్రమ ఉత్పత్తుల సరఫరా విషయంలో ప్రధానంగా సమస్యలను ఎదుర్కొంటుంది. ప్రాసెసర్ చిప్స్ కొరత కారణంగానే సరఫరా విషయంలో ఎక్కువ అంతరాయం ఏర్పడుతుంది. ఇది పరిమాణంలో నాణెం వలె చిన్నగా ఉన్న అంతరిక్ష రాకెట్లు నుంచి విమానాలు, మొబైల్స్ వంటి ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలో దీనిని వినియోగిస్తారు. ఆటోమోటివ్ పరిశ్రమ తయారీ సంస్థలు తమ కార్ల తయారీలో ఈ చిప్‌లను వినియోగిస్తున్నాయి. అందుకోసం మిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెడుతున్నాయి.

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా, అనేక ఆటో కంపెనీలు సైతం ఈ మైక్రోచిప్‌లపై ఎక్కువ శాతం ఆధారపడుతున్నాయి. ఈ చిప్‌లకు యంత్రాల కంటే చాలా ఎక్కువ శక్తి ఉంటుంది. టెస్లా అభివృద్ది చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మైక్రోప్రాసెసర్ పై సెలెక్ట్ కార్ లీజింగ్ అనే సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం మనుషులను చంద్రుడు మీదకు తీసుకెళ్లిన అపోలో 11 రాకెట్ కంటే శక్తివంతమైనదని తేలింది. లాక్హీడ్ మార్టిన్ రూపొందించిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ F-35 Lightning-2 కంటే చాలా పవర్ ఫుల్ చిప్ అని సెలెక్ట్ కార్ లీజింగ్ సంస్థ తెలిపింది.

ఎలోన్ మస్క్ ఇటీవల ఎన్విడియా తయారు చేసిన మునుపటి చిప్ లను టెస్లా, శామ్ సంగ్ తయారు చేసిన చిప్‌లతో భర్తీ చేశారు. ఎన్విడియా చిప్‌లతో పోలిస్తే ఇప్పుడు వాటి పనితీరు 21 సార్లు మెరుగుపడింది. ఈ రెండు 'న్యూరల్ నెట్ వర్క్ ఆర్రే'లతో తయారు చేశారు. ఇవి ప్రతి సెకనుకు 36 ట్రిలియన్ ఆపరేషన్ల చేయగలవు. అంటే రెండు కలిపితే 72 ట్రిలియన్ ఆపరేషన్లు చేస్తాయి. ఈ చిప్స్ ఒకే సమయంలో కెమెరా, సెన్సార్, రాడార్ జీపీఎస్ డేటాను ప్రాసెస్ చేయగలవు. ముఖ్యంగా టెస్లా ఆటోమేటెడ్ డ్రైవింగ్ కోసం ఇవి చాలా ఉపయోగపడుతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కోసం వీటిని తయారు చేసినట్లు ఎలోన్ మస్క్ పేర్కొన్నారు. అగ్రస్థానంలో ఉన్న ఏకైక ‘కంప్యూటర్’ మానవ మెదడు అని సెలెక్ట్ కార్ లీజింగ్ సంస్థ తమ పరిశోధన ద్వారా వెల్లడించింది. మన మానవ మొదడు సామర్ధ్యం 1000 ట్రిలియన్.

చదవండి: మరోసారి పాన్‌ - ఆధార్‌ లింకింగ్ గడువు పొడగింపు

మరిన్ని వార్తలు