TS: పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసు

10 Jan, 2024 11:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలి పీఎస్‌లో పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసు నమోదైంది. గొర్రెల పంపిణీలో అవకతకలు జరిగాయంటూ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకం అమలులో అవకతవకలు చోటుచేసుకున్నాయి. గొర్రెల పంపిణీ కోసం గుంటూరు జిల్లా నుండి అధికారులు  గొర్రెలను తీసుకొచ్చారు.

గొర్రెలను ఇచ్చిన వారికి బదులు ఇతరుల ఖాతాలోకి నగదు జమ అయ్యిందని, మొత్తం 2 కోట్ల రూపాయలు మోసం జరిగిందని గచ్చిబౌలిలో ఫిర్యాదు చేశారు. పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. పలువురు అధికారులకు నోటీసులు జారీ చేశారు.

>
మరిన్ని వార్తలు