-

మైనారిటీ స్కాలర్‌షిప్ కార్యక్రమంలో రూ.144 కోట్ల కుంభకోణం

29 Aug, 2023 21:40 IST|Sakshi

న్యూఢిల్లీ: మైనారిటీ స్కాలర్‌షిప్ కార్యక్రమంలో అవకతవకలపై విచారణ చేపట్టిన సీబీఐ ఈ మొత్తం విద్యా సంస్థల్లో 53 శాతం బోగస్ సంస్థలేనని తేల్చింది. 

మైనారిటీలకు స్కాలర్‌షిప్ ఇచ్చే కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో కింద యాక్టివ్‌గా ఉన్న విద్యా సంస్థలలో దాదాపు 53 శాతం నకిలీవేనని గుర్తించారు సీబీఐ అధికారులు.  

గత ఐదేళ్ళలో 18 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 830 సంస్థల్లో భారీగా అవినీతి జరిగినట్లు విచారణలో వెల్లడైందని ఈ కుంభకోణంలో దాదాపుగా  రూ.144.83 కోట్లు కొల్లగొట్టినట్లు వెల్లడించింది సీబీఐ. అనుమానిత నిందితుల్లో ఈ 830 సంస్థలకు చెందిన ప్రభుత్వాధికారులు, అనేక PSU బ్యాంకుల అధికారులు ఉన్నారని తెలిపింది సీబీఐ. 

ఏటా సుమారు 65 లక్షల మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం నుండి ఆయా పథకాల క్రింద మైనారిటీ స్కాలర్‌షిప్‌లను పొందుతున్నారు. ముస్లింలు, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారాసీలకు చెందిన ఆరు మైనారిటీ వర్గాల విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందించేవారు. 

ఇది కూడా చదవండి: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విద్యార్థినులు రక్తంతో లేఖ..

మరిన్ని వార్తలు