యరపతినేని కేసు: కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

19 Nov, 2020 20:43 IST|Sakshi
టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు(ఫైల్‌ ఫొటో)

25 చోట్ల సీబీఐ సోదాలు

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గుంటూరు, హైదరాబాద్ సహా 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో కీలక డాక్యుమెంట్లు, నగదు, పలు వస్తువులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. కాగా లైమ్‌స్టోన్ అక్రమ మైనింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రకృతి వనరులను దోచుకున్నారనే  అభియోగాలపై యరపతినేని శ్రీనివాసరావు సహా ఆయన ముఖ్య అనుచరులు 13 మందితో పాటు మొత్తం 17 మందిపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2014-18 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో కొనకి, కేసానుపల్లి, నడికుడి గ్రామాలలో  కొనసాగిన అక్రమ మైనింగ్ పరిమాణాన్ని నిర్ధారించేందుకు సీబీఐ శాటిలైట్ ఇమేజ్‌లను విశ్లేషిస్తోంది.(చదవండి: ఉల్లం‘గనుల్లో బినామీలు’)

నిందితుల్లో యరపతినేని అనుచరులు
1. నెల్లూరి శ్రీనివాసరావు (కేశానుపల్లి)
2. వేముల శ్రీనివాసరావు (నారాయణపురం, నడికుడి)
3. ఓర్సు వెంకటేశ్వరరావు (నడికుడి)
4.వేముల ఏడుకొండలు (నారాయణపురం, నడికుడి)
5. ఇర్ల వెంకటరావు (నారాయణపురం, నడికుడి) 6. బత్తుల నరసింహారావు (దాచేపల్లి)
7. మీనిగ అంజిబాబు (జనపాడు)
8. గ్రంధి అజయ్‌కుమార్‌ (పిడుగురాళ్ల)
9. జి.వెంకట శివకోటేశ్వరరావు (పిడుగురాళ్ల)
10. ఓర్సు ప్రకాశ్‌ (కొండమోడు–రాజుపాలెం)
11. వర్ల రత్నం (పిడుగురాళ్ల)
12. నంద్యాల నాగరాజు (కొండమోడు–రాజుపాలెం)
3. ఆలపాటి నాగేశ్వరరావు (ధరణికోట–అమరావతి) సహా మరో నలుగురు కేసులో నిందితులుగా ఉన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా