సహజీవనం పేరుతో ఒక్కో సీజన్‌లో ఒక్కో భాగస్వామి.. ఆరోగ్యకరం కాదు

2 Sep, 2023 16:19 IST|Sakshi

లక్నో: సహజీవనం పేరిట పాశ్చాత్య సంస్కృతి వెర్రితలలు వేసి భారత సంస్కృతిని వివాహ వ్యవస్థను నాశనం చేస్తోందని వ్యాఖ్యానించింది అలహాబాద్ హైకోర్టు. ఈ సందర్బంగా సీజన్ల వారీగా భాగస్వాములను మార్చుకుంటూ పోవడం ఆరోగ్యకరమైన సమాజానికి మంచిది కాదని తెలిపింది కోర్టు.   

అన్నీ అయిపోయాక.. 
అలహాబాద్‌లో అద్నాన్ అనే ఓ వ్యక్తి పరస్పర అంగీకారంతో యూపీలోని సహరాన్‌పూర్‌కు చెందిన  ఓ యువతితో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఆ యువతి అనూహ్యంగా గర్భం దాల్చడంతో అద్నాన్ పెళ్ళికి నిరాకరించాడు. దీంతో ఆ యువతి అలహాబాద్ హై కోర్టును ఆశ్రయించగా విచారణ సమయంలో అలహాబాద్ కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ సహజీవనంపై కీలక వ్యాఖ్యలు చేసింది. 

అంత సులువు కాదు.. 
ఒక వ్యక్తికి వివాహ వ్యవస్థ కల్పించినంత భద్రత కానీ సామాజిక అంగీకారం కానీ సహజీవనం కల్పించలేదని తెలిపారు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిద్ధార్థ్. దీర్ఘకాలిక పరిణామాలపైఅవగాహనలేక యువత ఇలాంటి తప్పటడుగు వేస్తోంది. వివాహ వ్యవస్థ మనుగడలో లేని దేశాల్లో సహజీవనం సర్వసాధారణంగా మారిపోయింది కానీ ఇపుడు వారు ఈ సమస్య నుండి బయటపడి వివాహ వ్యవస్థను కాపాడటానికి నానా అవస్థలు పడుతున్నాయని అన్నారు. అయినా సీజన్ల వారీగా భాగస్వామిని మార్చడం సమాజపురోగతికి చేటు అని తెలిపారు.

ఇది కూడా చదవండి: దీప్తిది హత్యే! కొలిక్కి వచ్చిన కోరుట్ల టెక్కీ కేసు

మరిన్ని వార్తలు