ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకున్నాం: ఏఎస్పీ

23 May, 2022 15:57 IST|Sakshi

సాక్షి, కాకినాడ: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ హత్య కేసు విచారణ జరుగుతోందని ఏఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. అనంతబాబు పోలీస్‌ కస్టడీలో ఉన్నారని తెలిపారు. ఈ రోజు అనంతబాబును అరెస్ట్‌ చేస్తామని ఏఎస్పీ వెల్లడించారు. ఘటన జరిగిన రోజు ఎక్కడున్నారనే దానిపై గన్‌మెన్లకు సంజాయిషీ నోటీసులను పోలీసులు జారీ చేశారు.
చదవండి: నూరేళ్ల ఆశలు సమాధి...భర్త, పిల్లలు కళ్లెదుటే..

మరిన్ని వార్తలు