అర్థరాత్రి బీభత్సం, మాజీమంత్రిని తాళ్లతో కట్టేసి మరీ

5 Apr, 2021 08:46 IST|Sakshi

మీడియా టైకూన్‌, మాజీమంత్రి బెర్నార్డ్ టాపీ తప్పిన ప్రమాదం

అడిడాస్‌ మాజీ యజమాని కూడా అయిన టాపీ దంపతులపై  దొంగల దాడి

 తాళ్లతో కట్టేసి మరీ దోపిడీ

అతిపెద్ద కుంభకోణంలో విచారణనెదుర్కొంటున్న టాపీ

పారిస్‌ : ఫ్రెంచ్ వ్యాపారవేత్త , మాజీ మంత్రి, మిలియనీర్  బెర్నార్డ్ టాపీ(78)కి తృటిలో అతిపెద్ద ప్రమాదం తప్పింది. అడిడాస్‌ మాజీ యజమాని కూడా అయిన టాపీ ఇంటిపై దొంగలు చోరికి తెగబడ్డారు. ఈ సందర‍్భంగా  టాపీ దంపతులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టాపీతోపాటు ఆయన భార్య డొమినిక్ కూడా గాయాల  పాలయ్యారు. అయితే డొమినిక్ టాపీ ఎలాగోలా తప్పించుకుని  పొరుగువారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. పారిస్ సమీపంలోని కాంబ్స్-లా-విల్లేలోని ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

సెక్యూరిటీ కన్నుగప్పి విలాసవంతమైన "మౌలిన్ డి బ్రూయిల్"  భవనం మొదటి అంతస్తులోని కిటికీ గుండా నలుగురు వ్యక్తులు ప్రవేశించారు. అనంతరం బెర్నార్డ్ టాపీ దంపతులను ఎలక్ట్రికల్ తాళ్ళతో కట్టేసి మరీ దాడికి పాల్పడ్డారు.  అయితే ఇద్దరూ స్వల్ప గాయాలతో బయట పడ్డారని టాపీ మనువడు రోడోల్ఫ్ టాపీ చెప్పారు. అటు ఈ ఘటనను హింసాత్మక దోపిడీగా పోలీసులు భావిస్తున్నారు. అతి ఖరీదైన రోలెక్స్ వాచీలు,ఇత ఢైమండ్‌ ఆభరణాలను  అపహకరించికు పోయినట్టు సమాచారం. ఈ ఘటనపై  దర్యాప్తు జరుగుతోందని పోలీసులు ప్రకటించారు. 

కాగా 1992 లో ఫ్రాంకోయిస్ మిట్టర్‌రాండ్ ప్రభుత్వంలో కొంతకాలం పట్టణ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన టాపీ కెరీర్ ప్రారంభంలో వివాదాల్లో చిక్కుకున్న సంస్థలను కొనుగోలు చేసి క్రీడా,  మీడియా సామమ్రాజ్యాన్ని విస్తరించాడు.  కానీ  ఆ తరువాత  అవినీతి, పన్ను మోసం, కార్పొరేట్ ఆస్తులను దుర్వినియోగం లాంటి కేసులలో దోషిగా తేలాడు. ఈ కేసు అప్పటి ఆర్థికమంత్రి క్రిస్టిన్ లాగార్డ్‌ మెడకు కూడా  చుట్టుకోవడం ప్రకంపనలు రేపింది. ఈ కేసులో ఐదు నెలలు శిక్ష తరువాత 1997 లో జైలు నుండి విడుదలయ్యాడు. దీనికి తోడు 1993లో అడిడాస్ స్పోర్ట్స్ అపెరల్ కంపెనీలో తన వాటాను ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఫ్రెంచ్ బ్యాంక్ క్రెడిట్ లియోనైస్‌కు విక్రయించడం పెద్ద  దుమారమే సృష్టించింది. 

ఈ  ఆరోపణలు కొనసాగుతుండగానే 2012 లో దక్షిణ ఫ్రెంచ్ దినపత్రిక లా ప్రోవెన్స్ , ఇతర పత్రికలను స్వాధీనం చేసుకుని మీడియా బాస్‌గా అవతరించాడు.  అనంతరం ఫ్రాన్స్ టాప్ ఫుట్‌బాల్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌పై  ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా 400 మిలియన్ యూరోల విలువైన (సుమారు 470 మిలియన్ డాలర్లు) అతిపెద్ద కుంభకోణం కేసులో విచారణను ఎదుర్కుంటున్నాడు. అయితే టాపీ (కడుపు క్యాన్సర్, అన్నవాహిక  క్యాన్సర్‌) అనారోగ్యం కారణంగా విచారణ వాయిదా పడింది. ఈ ఏడాది మేలో ఈ కుంభకోణంపై విచారణ తిరిగి ప్రారంభం కానుందని అంచనా.

మరిన్ని వార్తలు