నాలుగు నెలల క్రితం వివాహం.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన భర్త..

18 Oct, 2021 05:01 IST|Sakshi
నవీన్‌కుమార్‌ (ఫైల్‌)

సాక్షి, జీడిమెట్ల(హైదరాబాద్‌): కట్టుకున్న ఇల్లాలు ఇష్టం లేకపోవడంతో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్‌ కళావతినగర్‌కు చెందిన హారిక(19), నవీన్‌కుమార్‌ భార్యాభర్తలు. వీరికి నాలుగు క్రితం వివాహం కాగా నవీన్‌కుమార్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లోని న్యూఎరా లేడీస్‌ టైలర్స్‌లో ఫ్యాషన్‌ డిజైనర్‌గా పని చేస్తున్నాడు.

దసరా పండుగ నేపథ్యంలో ఈ నెల 15న ఉదయం 10.30 గంటకు భార్యను బస్సు ఎక్కించిన నవీన్‌కుమార్‌ తెలిసిన వారి నుంచి డబ్బులు వచ్చేది ఉందని, వాటిని తీసుకువస్తానని చెప్పాడు. కాగా అదే రోజు సాయంత్రం 4 గంటలకు నవీన్‌కుమార్‌ ఫోన్‌కు కాల్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. అయితే 16వ తేదీ ఉదయం 10 గంటలకు నీ బ్యాగ్‌లో లెటర్‌ ఉంది చూడమని హారికకు మెసెజ్‌ పంపాడు.

దీంతో లెటర్‌ను తీసి చూడగా ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు.. అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను’ అని రాసి ఉంది. దీంతో ఆందోళన చెందిన ఆమె భర్త జాడ కోసం అతడి తమ్ముడు, చెల్లెలికి ఫోన్‌ చేయగా రాలేదని చెప్పారు. భర్త ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆదివారం హారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు