మాదాపూర్‌లో జాగ్వార్‌ కార్‌ హల్‌చల్‌.. ఒకరు మృతి

8 May, 2021 22:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో శనివారం రాత్రి జాగ్వార్‌ కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్ ఫ్లై ఓవర్ వద్ద పాదచారుడిపై దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సంఘటన తెలుసుకున్న వెంటనే పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్‌ కాలనీ నుంచి మాదాపూర్ వైపు జాగ్వార్‌ కారు శనివారం రాత్రి 9 గంటల సమయంలో అతి వేగంగా దూసుకుంటూ వచ్చింది. ఈ సమయంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని మాదాపూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కర్ఫ్యూ అమల్లో ఉండడంతో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి వేగంగా నడుపుతూ నిబంధనలు అతిక్రమించాడు. అసలు కర్ఫ్యూ సమయంలో బయటకు ఎందుకు వచ్చాడు? అనేది తెలియాల్సి ఉంది.

చదవండి: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
చదవండి: ఒకేసారి నాలుగు ప్రాణాలు: కుటుంబాన్ని చిదిమేసిన కరోనా

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు