రూ.10 కోట్ల భూ కుంభకోణంలో జనసేన నాయకుడు

9 Aug, 2021 11:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పోలీసుల అదుపులో జనసేన రాష్ట్ర కార్యదర్శి

అగతవరప్పాడులో రూ.10 కోట్ల భూ కుంభకోణం

పోలీసుల అదుపులో ఏడుగురు   

పెదకాకాని(పొన్నూరు): రూ.10 కోట్ల విలువైన భూ కుంభకోణంలో పెదకాకాని పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వారిలో జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పాత్ర ఉందనే అనుమానంతో అతడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అగతవరప్పాడుకు చెందిన కె. నారాయణమ్మ తన 1.42 ఎకరాల భూమిని తన మరణానంతరం మేనల్లుడు ఒడ్డెంగుంట శివసాగర్, అతని భార్య పద్మజకు దక్కేలా వీలునామా రాశారు. నారాయణమ్మకు ఆ పొలాన్ని అమ్మిన పాండురంగారావు ఆ భూమిని మళ్లీ గుంటూరుకు చెందిన మరొక వ్యక్తికి అమ్మాడు. దీంతో ఇరువర్గాలూ కోర్టును ఆశ్రయించాయి.

2012లో నారాయణమ్మ చనిపోగా, శివసాగర్‌ కూడా కొద్దికాలానికి మరణించాడు. ఇదే అదునుగా భూమిని కాజేసేందుకు యేమినేడి అమ్మయ్య, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రాధికారెడ్డి, రామనుజం కలిసి ఓ మీడియా ప్రతినిధి ద్వారా రూ.10 కోట్ల విలువైన భూమిని రూ.3 కోట్లకు గుత్తా సుమన్‌కు అమ్మేందుకు కుంచనపల్లి మాజీ సర్పంచి బడుగు శ్రీనివాసరావు పేరిట నకిలీ వీలునామా చేయించారు. లింక్‌ డాక్యుమెంట్ల కోసం మరో ఇద్దరి పేరిట మార్చారు. జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు, బొబ్బా వెంకటేశ్వరరావు, కోమలి, రాఘవ పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై 2017లో శివసాగర్‌ భార్య పద్మజ ఫిర్యాదు చేయగా, ప్రస్తుతం నిందితుల అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధంచేసినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు