కోరుట్ల దీప్తి కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో చందన, ఆమె ప్రియుడు

1 Sep, 2023 12:31 IST|Sakshi

సాక్షి, జగిత్యాల జిల్లా: కోరుట్ల దీప్తి మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హైదరాబాద్‌ శివారులో మృతురాలి సోదరి చందన, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్తి కేసులో నిందితురాలిగా భావిస్తున్న చెల్లెలు చందనపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

నాలుగు బృందాలుగా మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు.  ఈ కేసులో కీలకం కానున్న పోస్ట్ మార్టం రిపోర్ట్.. వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మూడు రోజుల క్రితం ఇంట్లో  ఆమె చెల్లెలు చందన, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి రాత్రి ఇంట్లో మద్యం పార్టీ చేసుకున్న మృతురాలు దీప్తి.. అనుమానాస్పదంగా మృతి చెందింది. 

చదవండి: కోరుట్ల దీప్తి కేసులో కీలక పరిణామం

చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయే సమయంలో రూ. 2 లక్షల నగదు, రూ.90 లక్షలు విలువ చేసే కిలోన్నర బంగారు నగలు, పాస్‌పోర్టు తీసుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. చందన బాయ్‌ఫ్రెండ్‌ హైదరాబాదీగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. చందన ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా బాయ్‌ ఫ్రెండ్‌ వివరాలు పోలీసులు సేకరించారు. ఇద్దరి సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ ఉండటంతో ఆచూకీ కనుక్కోవడం కష్టతరంగా మారింది. దీప్తి, చందనలకు మద్యం బాటిళ్లు ఎవరు తెచ్చి ఇచ్చారన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. హైదరాబాద్‌ బాయ్‌ ఫ్రెండ్‌ తీసుకుని వచ్చాడా? లేక స్థానికంగా ఉన్న ఎవరైనా కొనుక్కుని తెచ్చారా? అన్న విషయం తేలలేదు

మరిన్ని వార్తలు