మహిళా ఉద్యోగితో ప్రిన్సిపాల్‌ రాసలీలలు.. వీడియో బహిర్గతం కావడంతో..

19 Dec, 2022 13:38 IST|Sakshi
ఆనంద్‌ కుమార్‌ (ఫైల్‌)   

మచిలీపట్నం(కృష్ణా జిల్లా): మైనార్జీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ బి.ఆనంద్‌ కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు వేస్తూ పీఆర్‌ఈఐ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.నర్సింహరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.  ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగితో ప్రిన్సిపాల్‌ ఆనంద కుమార్‌  పాఠశాలలోనే రాసలీలలు సాగిస్తున్న దృశ్యాలు బహిర్గతం కావటంతో, ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సున్నితమైన అంశమైనందున విషయం తెలిసన వెంటనే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సంస్థ గుంటూరు సెక్రటరీ, జిల్లా కన్వీనర్‌ అదేవిధంగా మచిలీపట్నం డెప్యూటీ డీఈవో సుబ్బారావుతో కూడిన త్రీమెన్‌ కమిటీ విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు.

ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్‌ పాఠశాలలోని తన చాంబర్‌లో ఓ మహిళా ఉద్యోగినితో రాసలీలలుసాగిస్తున్నట్లు విషయం వాస్తవమే అని తేలింది. దీంతో దీన్ని తీవ్రంగా పరిగణించి, అతన్ని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏలూరు జిల్లాలోని ముసునూరు బాలుర మైనార్టీ పాఠశాలలో పీజీటీ సోషల్‌ టీచర్‌గా పనిచేస్తున్న పి.సాంబశివరావును మచిలీపట్నం గురుకుల పాఠశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ నియమించారు.

కాగా అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని విధుల నుంచి పూర్తిగా తొలగించేందుకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు అనుగుణంగా నేడో, రేపో ఈ మేరకు ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయి నివేదిక మేరకు రాష్ట్ర మైనార్టీ గురుకుల సంస్థ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసిన విషయం వాస్తవమేనని త్రీమెన్‌ కమిటీ సభ్యుడు, మచిలీపట్నం డెప్యూటీ డీఈవో యూవీ సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. 

ప్రిన్సిపాల్‌ ఆనంద్‌ కుమార్‌ రిమాండ్‌కు తరలింపు...
కోనేరుసెంటర్‌: మైనారిటీ గురుకుల పాఠశాలలో కంప్యూటర్‌ ఆపరేటర్‌తో రాసలీలలు సాగిస్తూ దొరికిపోయిన ప్రిన్సిపాల్‌ ఆనందకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌తో కామకలాపాలు సాగిస్తూ విద్యార్థులకు సెల్‌ఫోన్‌ లో అడ్డంగా దొరికిపోయిన ఆనందకుమార్‌ ఆ వీడియో తీసిన విద్యార్థులను చితకబాదిన విషయం పాఠకులకు విధితమే.

ప్రిన్సిపాల్‌ చేతిలో ఘోరంగా దెబ్బలు తిన్న విద్యార్థి చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి ఆనంద్‌ కుమార్‌ ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా అదే పాఠశాలలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ గా పనిచేస్తున్న షకీలా ప్రిన్సిపాల్‌ ఆనంద్‌ కుమార్‌ తనను ఆయన కార్యాలయంలోకి పిలిచి బలవంతంగా లోబరచుకునేందుకు ప్రయత్నించాడంటూ పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది. అటు విద్యార్థి ఇటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ షకీలా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి ఆనంద్‌ కుమార్‌ను రిమాండ్‌ కు తరలించినట్లు సీఐ రాజశేఖర్‌ తెలిపారు.
చదవండి: ఇద్దరు భార్యలు.. మరొకరితో వివాహేతర సంబంధం.. మొదటి భార్య షాకింగ్‌ ట్విస్ట్‌

మరిన్ని వార్తలు