డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. స్టార్‌ హోటల్‌కు పిలిచి

29 Jul, 2021 15:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: ప్రస్తుతం యువతీయువకుల మధ్య సరికొత్త బంధాలకు డేటింగ్‌ యాప్‌లు వేదికవుతున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయం కావడం.. వారితో స్నేహం దారుణ సంఘటనలకు దారి తీస్తోంది. యువతీయువకులతో పాటు గే డేటింగ్‌ యాప్‌లు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆ యాప్‌లను ఉపయోగించుకున్న వారు పలు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ యువతిని తన పుట్టినరోజుకు పిలిచి స్టార్‌ హోటల్‌లో అత్యాచారం చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబైకి చెందిన ఓ యువతికి డేటింగ్‌ యాప్‌లో ఓ యువకుడు నెల కిందట పరిచయమయ్యాడు. అతడితో చాటింగ్‌ కొనసాగుతోంది. ఇక సోమవారం (జూలై 26వ తేదీ)న ఆమె పుట్టినరోజు ఉండడంతో అతడు ముంబైలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఉన్న వర్లీలోని ఓ స్టార్‌ హోటల్‌లో బర్త్‌ డే ఏర్పాట్లు చేశాడు. నీ కోసం ఈ ఏర్పాట్లు చేశానని చెప్పి ఆమెను హోటల్‌కు ఆహ్వానించాడు. అక్కడకు చేరుకున్న యువతికి అతడు మందు గ్లాస్‌ ఇచ్చాడు.

ఆ తర్వాత నెమ్మదిగా మత్తులోకి జారుకుంది. అనంతరం అతడు హోటల్‌ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తేరుకున్న అనంతరం తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని గుర్తించి షాక్‌కు గురయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు