పుట్టింటికి వెళ్లిన భార్య.. బాధతో​ భర్త.. చివరికి విషాదం..

26 Dec, 2021 11:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పెనమలూరు(కృష్ణా జిల్లా): భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనమలూరుకు చెందిన పోలగాని నాగరాజు(25)కు అదే గ్రామానికి చెందిన బంకా కృపతో వివాహమైంది. శుక్రవారం వడ్లు కాటా వేసే పనికి వెళ్లిన నాగరాజు రాత్రి ఇంటికి చేరాక భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. విషయం తెలిసిన నాగరాజు తండ్రి రాంబాబు కొడుకు ఇంటికి వచ్చి చూడగా నాగరాజు ఉరేసుకుని మృతి చెంది ఉన్నాడు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు.
చదవండి: సోడా తాగి వస్తా.. ఇంట్లో నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యం

మరిన్ని వార్తలు