OnlinePaymentFraud: టీవీ రీచార్జ్‌, ఘరానా మోసం

2 Sep, 2021 09:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆన్‌లైన్‌ మోసం టీవీ రీచార్జ్‌..రూ. 1.18 లక్షలు  మాయం  

బాలానగర్‌: బ్యాంకు అకౌంట్ల వివరాలు, పిన్‌ నెంబర్లు, పాస్‌వర్డ్స్‌ ఎవరికీ చెప్పొద్దని ఎంత మొత్తుకుంటున్నా, వినియోగదారులు మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉన్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బును క్షణాల్లో పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఆన్‌లైన్‌ ద్వారా టీవీ రీచార్జ్‌ చేసిన మహిళ రూ.1.18 లక్షలు పోగొట్టుకున్న ఘటన బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

సీఐ ఎండీ వాహిదుద్దీన్‌ వివరాల ప్రకారం.. ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన సంధ్య గత నెల 30న సన్‌ డైరెక్ట్‌ రీచార్జ్‌ చేయడానికి ప్రయత్నించగా కాలేదు. దీంతో ఆమె గూగూల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ వెతికి కనిపించిన నంబర్‌కు ఫోన్‌ చేసింది.  తమ సన్‌ డెరెక్ట్‌ రీచార్జ్‌ కావడం లేదని తెలుపగా టీమ్‌వీవర్‌ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకొని చేయాలని అవతలి వ్యక్తి చెప్పడంతో ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రయత్నించినా కాలేదు. మళ్లీ రీచార్జ్‌ కావడం లేదని బాధితురాలు చెప్పగా మీ యూనో యాప్‌ పిన్‌ నెంబర్, పాస్‌వర్ట్‌ చెప్పండి, ఎలా చేయాలో చెబుతానని కోరగా ఆమె చెప్పడంతో ఐదు దఫాలుగా రూ. 1,18,000 ఆమె అకౌంట్‌లో నుంచి డెబిట్‌ అయ్యాయి. మోసపోయినట్లు గ్రహించిన మహిళ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు