Hyderabad: రౌడీషీటర్‌ దారుణ హత్య

7 Oct, 2022 09:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాత కక్షల నేపథ్యంలో ఓ రౌడీషీటర్‌ గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘట న భవానీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ అంజద్‌ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌పురా ఇమామ్‌బడా ప్రాంతానికి చెందిన సయ్యద్‌ రజా ఖురేషి కుమారుడు సయ్యద్‌ మహమ్మద్‌ భక్తియార్‌ ఆఘా (25) రెయిన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నవాజ్‌ వ్యక్తి హత్య కేసులో నిందితుడు.

సయ్యద్‌ మహమ్మద్‌ ఆఘాపై రెయిన్‌బజార్‌ పీఎస్‌లో రౌడీషీట్‌ కూడా నమోదై ఉంది. ఈ నెల 5న తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో కుమ్మర్‌వాడీ ప్రాంతంలో సయ్యద్‌ మహమ్మద్‌ ఆఘాపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. పాతకక్షల నేపథ్యంలో సయ్యద్‌ మహ్మద్‌ ఆఘా హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంతోష్‌నగర్‌ ఏసీపీ శ్రీనివాస్‌ రెడ్డి, డీఐ శేఖర్‌ రెడ్డి ఘటనా స్థలంలో వివరాలను సేకరించారు.  

చదవండి: (Hyderabad: రూ. 2410 కోట్ల లింక్‌ రోడ్ల పనులకు ప్రభుత్వం అనుమతులు)

మరిన్ని వార్తలు