ఏడేళ్ల బాలికపై అత్యాచారం

10 Jul, 2021 00:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హోషియార్పూర్‌: పంజాబ్‌లోని నంగాల్‌ షాహిదాన్‌ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. గురువారం బాలిక తల్లిదండ్రులు పని చేసేందుకు బయటకు వెళ్లగా, పక్కింటి వ్యక్తి అయిన సర్బ్‌జిత్‌ సింగ్‌ బాలికను దగ్గర్లోని పొలానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టాడు. తల్లిదండ్రులు వచ్చాక విషయం తెలుసుకొని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.   

మరిన్ని వార్తలు