దారుణం: అద్దె అడిగితే హతం చేశాడు

2 Mar, 2021 11:40 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లులో దారుణం చోటుచేసుకుంది. అద్దె అడిగినందుకు ఇంటి యజమానిని హతమార్చాడో దుర్మార్గుడు. వివరాలు.. అడపా చిన్న కొండయ్య అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం వంగా ప్రసాద్‌(50) ఇంట్లో అద్దెకు దిగాడు. ఈ క్రమంలో కిరాయి చెల్లించమని అడగటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన కొండయ్య.. ప్రసాద్‌ తలపై బండ రాయితో కొట్టాడు. ఈ ఘటనలో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం కొండయ్య నేరుగా పోలీస్‌ స్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు.

చదవండి: తండ్రి మృతి..అప్పులు తీర్చలేక కొడుకు ఆత్మహత్య

బస్సులో ప్రయాణికుడి మృతి 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు