మహిళ మెడలో పుస్తెల తాడు అపహరణ 

8 Jul, 2021 20:54 IST|Sakshi
బంగారం అపహరించిన వ్యక్తులను అరెస్ట్‌ చేస్తున్న ఎస్‌ఐ రాంముర్తి

సాక్షి, త్రిపురారం(నల్లగొండ): ఇద్దరు దుండగులు ఒంటరిగా ఉన్న మహిళ మెడలో పుస్తెలతాడును అపహరించారు. చేశారు. బాధితురాలి సమాచారం మేరకు గ్రామస్తులు వారిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన త్రిపురారం మండలం బొర్రాయిపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీ సులు, బాధితుల వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండల పరిధిలోని తుంగపాడ్‌ గ్రామంలో ఓ మహిళ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండాన్ని దుండగులు గమనించారు. స్కూటీపై వచ్చి ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కొని పరారయ్యారు.

అప్రమత్తమైన మహిళ సమీపంలో ఉన్న తన బంధువులకు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చింది. దుండగులు అదేసమయంలో బొర్రాయిపాలెంలో గ్రామస్తులకు అనుమానంగా తారసపడ్డారు. దీంతో వారిని నీలదీయగా పారిపోబో యారు. వెంబడించి పట్టుకుని చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు.  త్రిపురారం ఎస్‌ఐ రాంముర్తి సిబ్బందితో అక్కడికి చేరుకొని దుండగులను అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని ఘటన జరిగిన ప్రాంతం మేరకు  మిర్యాలగూడ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు