Tamil Nadu: మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌ స్వాధీనం

27 Feb, 2022 08:47 IST|Sakshi
ఇందుమది (ఫైల్‌)

చెన్నై: వేలూరు సమీపంలోని మూంజూరుపట్టుకి చెందిన ఇందుమది (30) వేలూరు రిజర్వ్‌ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఈమెకు 2010లో ప్రైవేటు ఉద్యోగి క్రిష్ణమూర్తితో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య, భర్తలు ఇద్దరూ పనిచేస్తుండడంతో పిల్లలు ఇడయంబట్టు గ్రామంలోని క్రిష్ణమూర్తి తల్లిదండ్రుల వద్ద ఉన్నారు. ఈమె పోలీస్‌ క్యార్టర్స్‌లో ఉంటున్నారు.

శుక్రవారం ఆమె విధులకు హాజరు కాకపోవడంతో అనుమానించిన సహ కానిస్టేబుళ్లు.. ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు రాత్రి పోలీస్‌ క్యార్టర్స్‌కు వచ్చి చూడగా ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉండటాన్ని గుర్తించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన మృతికి ఎవరూ కారణం కాదని రాసి ఉంది. కాగా పనిభారం, సెలవులు దొరక్కపోవడంతో పిల్లలను చూసే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.  

చదవండి: (Hyderabad: కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం) 

మరిన్ని వార్తలు